పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) ఆన్‌లైన్లో చెల్లింపులు..

రిక‌రింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) పోస్టాఫీసులో ఒక ప్ర‌ముఖ పొదుపు ప‌థ‌కం.

Updated : 11 Jan 2021 14:16 IST

పోస్టాఫీసు ఆర్‌డి ఖాతాలో ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు 5.8%గా ఉంది.

రిక‌రింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) పోస్టాఫీసులో ఒక ప్ర‌ముఖ పొదుపు ప‌థ‌కం. చిన్న పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్ల‌ను  ప్ర‌తి త్రైమాసికంలో (3 నెల‌ల‌కొకసారి) కేంద్ర ప్ర‌భుత్వం స‌వ‌రిస్తుంది. ప్ర‌భుత్వం ఆర్‌డీతో స‌హా జ‌న‌వ‌రి నుండి మార్చి త్రైమాసికంలో వ‌డ్డీ రేట్లు మార్చ‌లేదు. 

పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్ (ఆర్‌డి) ఖాతాలో ఆన్‌లైన్‌లో కూడా డ‌బ్బు జ‌మ చేయ‌వ‌చ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) యాప్ ద్వారా మీరు ఆన్‌లైన్‌లో డ‌బ్బును పోస్ట్ ఆఫీస్ ఆర్‌డిలో జ‌మ చేయ‌వ‌చ్చు.

ఐపీపీబీ ద్వారా మీ పోస్టాఫీసు ఆర్‌డీ ఖాతాలో డ‌బ్బు బ‌దిలీ చేసే ప్రక్రియ‌.

1) మీ బ్యాంక్‌ ఖాతా నుండి `ఐపీపీబీ` ఖాతాకు డ‌బ్బును యాడ్ మ‌నీ చేయండి (జోడించండి).

2) `డీవోపి` ఉత్ప‌త్తుల‌కు వెళ్లండి. అక్క‌డ నుండి ఆర్‌డీ ఖాతాను ఎంచుకోండి.

3) మీ ఆర్‌డి ఖాతా నంబ‌ర్‌ను రాసి, ఆపై `డీవోపి` క‌స్ట‌మ‌ర్ ఐడిని రాయండి.

4) వాయిదాల వ్య‌వ‌ధి మ‌రియు మొత్తాన్ని ఎంచుకోండి.

5) `ఐపీపీబి` మొబైల్ అప్లికేష‌న్ ద్వారా చెల్లింపు బ‌దిలీ కోసం `ఐపీపీబి` మీకు తెలియ‌జేస్తుంది.

6) మీరు ఇండియా పోస్ట్ అందించే వివిధ పోస్ట్ ఆఫీస్ పెట్టుబ‌డి ఎంపిక‌ల‌ను ఎంచుకోవ‌చ్చు, `ఐపీపీబి` ప్రాథ‌మిక పొదుపు ఖాతా ద్వారా క్ర‌మం త‌ప్ప‌కుండా చెల్లింపులు చేయ‌వ‌చ్చు.

పోస్ట‌ల్ డిపాజిట్ రేట్ల‌ను జ‌న‌వ‌రి - మార్చి త్రైమాసికంలో పీపీఎఫ్‌, ఎన్ఎస్‌సి స‌హా చిన్న పొదుపు ప‌థ‌కాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌భుత్వం మార్చ‌లేదు.

1 నుండి 5 ఏళ్ల ట‌ర్మ్ డిపాజిట్లు 5.5 - 6.7 శాతం ప‌రిధిలో వ‌డ్డీ రేటును ప్ర‌స్తుతం పొందుతున్నాయి. 5 ఏళ్ల రిక‌రింగ్ డిపాజిట్ (ఆర్‌డీ)పై వ‌డ్డీ రేటు 5.8 శాతంగా ఉంది.

గ‌త నెల‌లో ప్ర‌భుత్వం డాక్‌పే డిజిట‌ల్ చెల్లింపుల యాప్‌ను విడుద‌ల చేసింది. దీన్ని పోస్ట్ ఆఫీస్ , `ఐపీపీబీ` క‌స్ట‌మ‌ర్లు కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని