Realme-Coca Cola Edition: కోక్‌ ప్రియుల కోసం రియల్‌మీ కోకా కోలా ఎడిషన్‌.. ధరెంతంటే?

కోకాకోలా ఎడిషన్‌ (Coca Cola Edition) స్మార్ట్‌ఫోన్‌ (Smartphone)లో యాప్‌లను కస్టమైజ్డ్‌ థీమ్‌తో రీడిజైన్‌ చేశారు. ఈ ఫోన్‌లో కెమెరా షట్టర్‌ సౌండ్‌ కోకాకోలా (Coca Cola) బాటిల్ మూత తెరిచినప్పుడు వినిపించే శబ్దం వచ్చేలా మార్పులు చేశారు. 

Updated : 10 Feb 2023 20:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోకాకోలా (Coca Cola) ప్రియుల కోసం రియల్‌మీ (Realme) కంపెనీతో కలిసి కోకాకోలా ఎడిషన్‌ (Coca Cola Edition) స్మార్ట్‌ఫోన్‌ (Smartphone)ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. రియల్‌మీ 10 ప్రో 5జీ కోకాకోలా ఎడిషన్‌ (Realme 10 Pro 5G Coca Cola Edition) పేరుతో ఈ ఫోన్‌ను విడుదల చేసింది. ఫోన్‌లో వెనుకవైపు కోకాకోలా లోగో ప్రత్యేక ఆకర్షణ. ఈ స్పెషల్‌ ఎడిషన్‌ కోసం కోకాకోలా ప్రత్యేక రింగ్‌టోన్‌ను రూపొందించింది. దాంతోపాటు ఇందులోని యాప్‌లను కస్టమైజ్డ్‌ యూఐతో రీడిజైన్‌ చేశారు. కోకాకోలా ఎడిషన్‌లో ఇతర ఫీచర్లు గురించి తెలుసుకుందాం. 

రియల్‌మీ 10 ప్రో 5జీ కోకాకోలా ఎడిషన్‌ ఫీచర్లు

ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 13 ఆధారిత కోకాకోలా థీమ్‌తో డిజైన్‌ చేసిన ఓఎస్‌తో పనిచేస్తుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌రేట్‌తో 6.72 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 695 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. కోకాకోలా ఎడిషన్‌లో మూడు కెమెరాలున్నాయి. వెనుక రెండు, ముందు ఒకటి ఉన్నాయి. వెనుకవైపు శాంసంగ్‌ హెచ్‌ఎమ్‌6 సెన్సర్‌తో 108 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు, 2 ఎంపీ సెకండరీ కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో 16 ఎంపీ కెమెరా అమర్చారు.

ఇందులో 80s Cola Filter పేరుతో ప్రత్యేక ఫొటో ఫిల్టర్‌ ఇస్తున్నారు. ఫోన్‌ కెమెరాతో తీసిన ఫొటోలను ఈ ఫీచర్‌ను ఉపయోగించి 1980లోని ఫొటోగ్రఫీ స్టైల్‌లోకి మార్చుకోవచ్చు. కెమెరా షట్టర్‌ సౌండ్‌ కూడా కోకాకోలా బాటిల్‌ మూత తెరిచినప్పుడు వినిపించే శబ్దం వస్తుంది. ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో కోకాకోలా స్పెషల్‌ ఎడిషన్‌ లభిస్తుంది. దీని ధర రూ. 20,999గా కంపెనీ నిర్ణయించింది. ఫిబ్రవరి 14 నుంచి ఫిప్ల్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని