Cashless Claims: మీకు తెలుసా? క్యాష్‌లెస్ క్లెయింలూ తిరస్కరిస్తారని..!
నగదు రహిత క్లెయిం సదుపాయంతో బీమా సంస్థలే ఆసుపత్రికి నేరుగా బిల్లు చెల్లిస్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్య బీమాలో (Health insurance) ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యాష్‌లెస్ (Cash less) చికిత్సలు పాలసీదారులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గతంలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే.. పాలసీ ఉన్నప్పటికీ పాలసీదారుడే ఆసుపత్రిలో డబ్బు కట్టాల్సి వచ్చేది. ఆ తర్వాత రీయింబర్స్మెంట్ క్లెయిం చేసుకునేవారు. దీంతో బిల్లు చెల్లింపులకు కావాల్సిన డబ్బు కోసం ఇబ్బందిపడేవారు. కానీ, ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవు. నగదు రహిత క్లెయిం చెల్లింపుల ద్వారా బీమా సంస్థలే ఆసుపత్రికి నేరుగా బిల్లు చెల్లిస్తున్నాయి. అయితే, కొన్నిసార్లు నగదు రహిత క్లెయింలూ తిరస్కరణకు గురికావొచ్చని మీకు తెలుసా? అయితే, ఎలాంటి సందర్భాల్లో ఇలా జరిగేందుకు అవకాశం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నాన్-నెట్వర్క్ ఆసుపత్రిలో చేరితే..
నగదు రహిత క్లెయిం సదుపాయాన్ని పొందేందుకు పాలసీదారుడు చికిత్స కోసం నెట్వర్క్ ఆసుపత్రిలో మాత్రమే చేరాలి. ఒకవేళ నాన్-నెట్వర్క్ ఆసుపత్రిలో చేరితే నగదు రహిత క్లెయింల సదుపాయం అందదు.
పత్రాలు సరిగ్గా లేకపోతే..
నగదు రహిత క్లెయిం పొందేందుకు.. పాలసీదారుడు చికిత్స కోసం చేరిన నెట్వర్క్ ఆసుపత్రి, క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ కోసం అనుమతి కోరుతూ బీమా సంస్థకు ప్రీ-ఆథరైజేషన్ రిక్వెస్ట్ పంపించాలి. దీంతోపాటు పాలసీదారుని మెడికల్ పత్రాలు (టెస్ట్ రిపోర్టులు, డాక్టర్ సూచించిన ప్రిస్క్రిప్షన్ సహా) పంపాల్సి ఉంటుంది. ఒకవేళ బీమా సంస్థకు పంపించే పత్రాలు తప్పుగా ఉన్నా లేదా అసంపూర్ణంగా ఉన్నా నగదు రహిత చికిత్స అభ్యర్థన తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.
పాలసీ జాబితాలో లేకపోతే..
బీమా సంస్థ, పాలసీ జాబితాలో పేర్కొన్న వ్యాధులకు మాత్రమే కవరేజీ అందిస్తుంది. ఒకవేళ మీరు జాబితాలో లేని వ్యాధితో ఆసుపత్రిలో చేరితే.. క్లెయింలను తిరస్కరిస్తుంది. కాబట్టి పాలసీ తీసుకునే ముందే వ్యాధుల జాబితాను తనిఖీ చేయాలి.
వెయిటింగ్ పీరియడ్ ముగియకపోతే..
ముందుస్తు వ్యాధులను, వెయిటింగ్ పీరియడ్ తర్వాత మాత్రమే బీమా సంస్థలు కవర్ చేస్తాయి. ఒకవేళ మీరు ముందుగా నిర్ధారణ అయిన వ్యాధితో వెయిటింగ్ పీరియడ్ ముగియక ముందే ఆసుపత్రిలో చేరితే బీమా సంస్థ క్లెయిం అభ్యర్థనను తిరస్కరిస్తుంది. ఇది క్యాష్‌లెస్ క్లెయింలకూ వర్తిస్తుంది.
ప్రీ-ఆథరైజేషన్ అభ్యర్థన ఆలస్యమైతే..
చికిత్స కోసం నెట్వర్క్ ఆసుప్రతిలో చేరితే.. బీమా సంస్థకు నెట్వర్క్ ఆసుపత్రి ప్రీ-ఆథరైజేషన్ రిక్వెస్ట్ పంపాలి. ఇది నిర్ణీత గుడువులోపు పూర్తిచేయాలి. ఒకవేళ ఈ పని చేయడంలో నెట్వర్క్ ఆసుపత్రి విఫలమైతే క్యాష్‌లెస్ క్లెయిం తిరస్కరించే అవకాశం ఉంటుంది.
సంప్రదింపు వివరాలు సరైనవి కాకపోతే..
క్లెయిం అభ్యర్థనను పరిష్కరించేందుకు బీమా సంస్థకు మీ సంప్రదింపు వివరాలు అవసరమవుతాయి. బీమా కంపెనీలో ఈ వివరాలు తప్పుగా నమోదు చేసినా, అసంపూర్ణంగా ఇచ్చినా లేదా అప్డేట్గా లేకపోయినా సంస్థ క్లెయింలను పరిష్కరించలేకపోవచ్చు.
బీమా సంస్థ క్యాష్‌లెస్ క్లెయిం తిరస్కరిస్తే ఏం చేయాలి?
ఒకవేళ మీరు క్లెయిం పొందేందుకు అర్హులు అయ్యి ఉండీ.. ఏదైనా కారణం చేత నగదు రహిత క్లెయింను బీమా సంస్థ తిరస్కస్తే రీయింబర్స్మెంట్ విధానంలో క్లెయిం చేసుకోవచ్చు. అయితే, ముందుగా ఆసుపత్రి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.
రీయింబర్స్మెంట్ ఫైల్ చేసే విధానం..
- ముందుగా మీరు ఆసుపత్రిలో చేరిన విషయాన్ని బీమా సంస్థకు తెలియజేయాలి.
- వ్యాధికి చికిత్స తీసుకుని, ఆసుప్రతి నుంచి డిశార్జ్ అయ్యే సమయంలో మొత్తం ఆసుపత్రి బిల్లులు, మెడికల్ రిపోర్ట్ లు, ప్రిస్క్రిప్షన్ సహా అన్ని పత్రాలు సేకరించి పెట్టుకోవాలి.
- ఆరోగ్య బీమా క్లెయిం ఫారంను పూర్తిచేసి, పాలసీపత్రాలు, ఆసుపత్రిలో సేకరించిన పత్రాలు అన్నింటినీ బీమా సంస్థకు అందించాలి. క్లెయిం ఫారం ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది.
- బీమా సంస్థ ఈ పత్రాలను స్వీకరించిన తర్వాత, పరిశీలించి క్లెయింను పరిష్కరిస్తుంది.
చివరిగా..
నగదు రహిత క్లెయింలు సౌకర్యవంతంగా ఉంటాయి. వైద్య అత్యవసర సమయంలో డబ్బు కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అలాగే కావాల్సిన పత్రాల కోసం ఆసుపత్రి చుట్టూ, క్లెయిం సెటిల్మెంట్ కోసం బీమా సంస్థ చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. కాబట్టి పైన తెలిపిన విషయాలను దృష్టిలో పెట్టుకుని క్యాష్‌లెస్ క్లెయిం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Punjab: డ్రగ్స్ స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం.. 5,500 మంది పోలీసులు.. 2వేల చోట్ల దాడులు!
-
Politics News
Smriti Irnai: మంత్రి మిస్సింగ్ అంటూ కాంగ్రెస్ ట్వీట్.. కౌంటర్ ఇచ్చిన స్మృతి ఇరానీ!
-
India News
అంబానీ ఇంట వారసురాలు.. మరోసారి తల్లిదండ్రులైన ఆకాశ్- శ్లోకా దంపతులు
-
General News
AP News: వాణిజ్యపన్నుల శాఖలో నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసిన సీఐడీ
-
Latestnews News
Ambati Rayudu: అంబటి రాయుడి విషయంలో మేనేజ్మెంట్ చాలా పెద్ద తప్పు చేసింది: అనిల్ కుంబ్లే
-
General News
Nizamabad: తెలంగాణ వర్సిటీ హాస్టళ్లకు సెలవులు.. రద్దు చేయాలని విద్యార్థుల డిమాండ్