Jeff Bezos: ప్రపంచ కుబేరుడి షర్ట్ ధర 980 రూపాయలట..!

ధనవంతుల ఒంటి మీద రిచ్ వస్తువులే ఉంటాయి. కానీ ఇటీవల ప్రపంచ ధనికుల్లో ఒకరైన జెఫ్ బెజోస్(Jeff Bezos) వేసుకున్న షర్ట్ మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతోంది. 

Updated : 27 Apr 2023 15:12 IST

కాలిఫోర్నియా: అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్ (Amazon founder Jeff Bezos).. ప్రపంచ కుబేరుల్లో ఒకరు. అలాంటి వ్యక్తి లైఫ్‌స్టైల్ కూడా ఖరీదుగానే ఉంటుంది. తినే ఆహారం నుంచి ఒంటి మీద ధరించే వస్తువులు అన్నీ రిచ్‌గానే కనిపిస్తాయి. కానీ, బెజోస్‌ తాజా చిత్రాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆయన వేసుకున్న షర్టే అందుకు కారణం.

ఇటీవల జరిగిన కోచెల్లా మ్యూజిక్ ఫెస్టివల్‌లో పాల్గొన్న బెజోస్ (Jeff Bezos) తన ప్రేయసితో కలిసి ఎంజాయ్‌ చేశారు. ఆ ఈవెంట్‌లో వారిద్దరు సంగీతానికి తగ్గట్టుగా స్టెప్పులేశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన ప్రతి ఒక్కరి కన్ను ఆయన వేసుకున్న డ్రెస్ మీదకే వెళ్లింది. దానిని చూసిన ఓ నెటిజన్‌.. ఆ షర్ట్ అమెజాన్‌ ఈ కామర్స్‌ సైట్‌లో 12 డాలర్ల (రూ.980)కు అందుబాటులో ఉందని పోస్టు పెట్టారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆయన షర్ట్ చాలా నచ్చిందని, అమెజాన్‌(Amazon) సేల్‌లోని షర్ట్‌కు దీనికి ప్రింటింగ్‌లో తేడా ఉందని కొందరు కామెంట్లు పెట్టారు. ఆయన ధరించింది ఖరీదైన షర్ట్ అని.. సేల్‌లో ఉన్నది దాని నకలు అని మరొకొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని