Recession: మాంద్యం స్వల్పం.. తక్కువ కాలమే

ఆర్థిక మాంద్యం చుట్టుముడుతుందనే ఆందోళనలు పెరిగిన వేళ, ఊరట కలిగించే సర్వే నివేదికను కేపీఎంజీ విడుదల చేసింది. 

Published : 10 Oct 2022 10:00 IST

అంతర్జాతీయంగా సీఈఓల అంచనా

దిల్లీ: ఆర్థిక మాంద్యం చుట్టుముడుతుందనే ఆందోళనలు పెరిగిన వేళ, ఊరట కలిగించే సర్వే నివేదికను కేపీఎంజీ విడుదల చేసింది. ఈసారి మాంద్యం సంభవించినా.. ఆ ప్రభావం స్వల్పంగా ఉంటుందని, అదీ తక్కువ కాలమేనని అంతర్జాతీయంగా 1300 మంది కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారు (సీఈఓ)ల్లో 58 శాతం మంది భావిస్తున్నారని కేపీఎంజీ 2022 సీఈఓ అవుట్‌లుక్‌ సర్వే పేర్కొంది. ఈ సీఈఓల్లో టాటా స్టీల్‌ నరేంద్రన్‌ కూడా ఉన్నారు. వచ్చే ఏడాది మాంద్యం సంభవించవచ్చని 86 శాతం మంది అంచనా వేస్తున్నారు. అత్యంత ఆందోళనకర అంశాల్లో మాంద్యం ఒకటని ఈ ఏడాది ప్రారంభంలో 9 శాతం మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పగా, ఈ సంఖ్య ప్రస్తుతం 14 శాతానికి పెరిగింది.

* మాంద్యం వల్ల కంపెనీల ఆదాయంపై 10 శాతం ప్రభావం పడొచ్చని 71 శాతం మంది అంచనా వేశారు. వృద్ధిపై ప్రభావం చూపొచ్చని 73 శాతం మంది తెలిపారు. మాంద్యం వస్తుందేమోనని 3 త్రైమాసికాలుగా జాగ్రత్తలు తీసుకున్నట్లు 76 శాతం మంది వెల్లడించారు.

* రాబోయే 6 నెలల పాటు ఆర్థిక వ్యవస్థ రాణిస్తుందనే విశ్వాసాన్ని 73 శాతం మంది వ్యక్తం చేశారు.

* రాబోయే మూడేళ్లు అంతర్జాతీయ వృద్ధి బాగుంటుందని భావించే వారి సంఖ్య 60 శాతం నుంచి 71 శాతానికి; తమ కంపెనీల వృద్ధి బాగుంటుందని విశ్వసిస్తున్న వారి సంఖ్య 60 శాతం నుంచి 85 శాతానికి పెరిగింది.

2023-24లో వృద్ధి 5.2 శాతం: నొమురా

భారత వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం, 2023-24లో 5.2 శాతంగా ఉంటుందని బ్రోకరేజీ సంస్థ నొమురా పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని