Reddit: రెడిట్‌లో 5శాతం ఉద్యోగుల తొలగింపు..!

Reddit: టెక్‌ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. తాజాగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ రెడిట్‌(Reddit) భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. కంపెనీ మొత్తం మానవ వనరుల్లో ఇది ఐదు శాతానికి సమానంగా తెలుస్తోంది. 

Published : 07 Jun 2023 12:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ సోషల్‌మీడియా వెబ్‌సైట్‌ రెడిట్‌(Reddit) తాజాగా భారీ ఎత్తున ఉద్యోగులపై వేటు(Layoffs) వేసింది. ఓ ఆంగ్ల వార్తాసంస్థ నివేదిక ప్రకారం దాదాపు 5శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా 90 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ప్రస్తుతం కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా 2,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక లేఆఫ్‌ల సమాచారాన్ని కంపెనీ సీఈవో హవ్‌మన్‌ ఉద్యోగులకు ఓ మెమో ద్వార తెలియజేశారు. 2024 చివరి నాటికి కంపెనీ ప్రణాళికలను సమీక్షించి ఓ కొలిక్కి తెస్తామని పేర్కన్నారు. ‘‘ఈ ఏడాది తొలి అర్ధభాగంలో కంపెనీ ఫలితాలు చాలా బలంగా ఉన్నాయి. ఈ పునర్‌ వ్యవస్థీకరణ ఫలితంగా ఆ జోరు ద్వితీయార్ధం.. ఆపై కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాం’’ అని వెల్లడించారు.

వచే ఏడాదికి బ్రేక్‌ఈవెన్‌ సాధించడం, డేటా, ఏపీఐ టూల్స్‌కు నిధులు సమకూర్చడానికి ప్రాధాన్యం ఇస్తామని రెడిట్‌ తెలిపింది. అలాగే, థర్డ్‌పార్టీ యాప్‌ డెవలపర్ల కోసం ధరలు పెంచే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నామని తెలిపింది. ఇక ఈ ఏడాదిలో నియామకాలు కూడా తగ్గించుకోవాలని రెడిట్‌ భావిస్తోంది. తొలుత ఈ ఏడాది 300 మందిని నియమించుకోవాలని నిర్ణయించింది. కానీ, ఇప్పుడు ఆ సంఖ్యను 100కు కుదించింది.

ఇప్పటికే టెక్‌ పరిశ్రమలో భారీగా లేఆఫ్‌లు విధిస్తున్నారు. గూగుల్‌లో ఇప్పటికే 12,000 మందిని తొలగించగా.. మైక్రోసాఫ్ట్‌ 10,000 మందిని జనవరిలో, మరో 500 మందిని మార్చిలో తొలగించింది. ఇక టెక్‌ దిగ్గజం మెటా ఇప్పటి వరకు 21,000 మందికి ఉద్వాసన పలికింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని