Redmi: రెడ్‌మీ నుంచి రెండు కొత్త 4జీ ఫోన్లు.. ధర, ఫీచర్ల వివరాలివే!

రెడ్‌మీ (Redmi)  రెండు కొత్త స్మార్ట్‌ఫోన్ల ( Smartphones)ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రెడ్‌మీ 12సీ (Redmi 12C), రెడ్‌మీ 12 4జీ (Redmi Note 12 4G) పేరుతో ఈ రెండు ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్లు 4జీ నెట్‌వర్క్‌ (4G Network)ను మాత్రమే సపోర్ట్‌ చేస్తాయి.

Published : 31 Mar 2023 00:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ రెడ్‌మీ (Redmi)  రెండు కొత్త స్మార్ట్‌ఫోన్ల (Smartphones)ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రెడ్‌మీ 12సీ (Redmi 12C), రెడ్‌మీ నోట్‌12 4జీ(Redmi Note 12 4G) పేరుతో ఈ రెండు ఫోన్లను విడుదల చేసింది. అందుబాటులో ధరలో అత్యుత్తమ ఫీచర్లతో ఈ ఫోన్లను ప్రవేశపెట్టినట్లు రెడ్‌మీ తెలిపింది. ఈ ఫోన్లు 4జీ నెట్‌వర్క్‌ (4G Network)ను మాత్రమే సపోర్ట్‌ చేస్తాయి. వీటి ధర, ఫీచర్ల వివరాలిలా ఉన్నాయి. 

రెడ్‌మీ 12సీ (Redmi 12C)

ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత ఎమ్‌ఐయూఐ 13 ఓఎస్‌తో ఈ మొబైల్‌ పనిచేస్తుంది. 6.71 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో పనిచేస్తుంది.   మీడియాటెక్‌ హీలియో G85 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో మూడు కెమెరాలున్నాయి. వెనుక రెండు, ముందు ఒకటి. వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 2 ఎంపీ సెకండరీ కెమెరా ఉంది. ముందుభాగంలో వీడియోకాల్స్‌/సెల్ఫీ కోసం 5ఎంపీ కెమెరాను అమర్చారు. రెడ్‌మీ 12 సీలో ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ కూడా ఉంది.  ఫోన్‌ చేతి నుంచి జారిపోకుండా గ్రిప్‌ కోసం బ్యాక్‌ప్యానెల్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది 10W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. 4 జీబీ ర్యామ్‌/64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 8,999 కాగా, 6 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 10,999గా కంపెనీ నిర్ణయించింది. ఏప్రిల్‌ 6 నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. 

రెడ్‌మీ నోట్‌ 12 4జీ (Redmi Note 12 4G )

240 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు.  ఐపీ35 రేటింగ్ కలిగిన ఈ ఫోన్‌కి ఫింగర్‌ప్రింట్‌ సదుపాయం ఉంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఎమ్‌ఐయూఐ 14 ఓఎస్‌తో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 685 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 5,000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్‌ ఛార్జింగ్ సదుపాయం ఉంది. వెనక భాగంలో మూడు కెమెరాలు ఉన్నాయి. 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్‌, 2 ఎంపీ నానో కెమెరా ఇచ్చారు. ముందు 13 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 6జీబీ ర్యామ్‌/64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999. 6 జీబీ/128 జీబీ ధర రూ. 16,999. ఏప్రిల్‌ 6 నుంచి అమ్మకాలు ప్రాంభమవుతాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని