Redmi 13 5G: రింగ్‌ ఫ్లాష్‌, 108MP కెమెరాతో రెడ్‌మీ 13 5జీ ఫోన్‌

Redmi 13 5G: రెడ్‌మీ 12 5జీకి కొనసాగింపుగా షావోమి 13 5జీని తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ ధర, ఫీచర్లు సహా ఇతర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Published : 09 Jul 2024 14:11 IST

Redmi 13 5G | ఇంటర్నెట్‌ డెస్క్‌: రెడ్‌మీ 13 5జీ స్మార్ట్‌ఫోన్‌ మంగళవారం భారత్‌లో విడుదలైంది. షావోమి హైపర్‌ఓఎస్‌తో వస్తున్న తొలి రెడ్‌మీ ఫోన్‌ ఇదే. క్రిస్టల్‌ గ్లాస్‌ డిజైన్‌తో రూపొందిన ఈ ఫోన్‌ (Redmi 13 5G) బడ్జెట్‌ ధరలో ప్రీమియం లుక్‌ను ఇస్తోంది.

డిజైన్‌ విషయంలో రెడ్‌మీ 13 5జీ (Redmi 13 5G).. 12 5జీని పోలి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేటుతో 6.79 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇచ్చారు. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌తో వస్తోంది. ఈ సెగ్మెంట్‌లో డ్యూయల్‌ గ్లాస్‌ డిజైన్‌తో వస్తోన్న ఫోన్‌ ఇదే అని కంపెనీ తెలిపింది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 ఏఈ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 33W ఫాస్ట్‌ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,030mAh బ్యాటరీని పొందుపర్చారు. 108MP ప్రధాన కెమెరా ఇచ్చారు. సెల్ఫీల కోసం 13MP కెమెరా ఉంది. కెమెరా పక్కనున్న రింగ్‌ ఫ్లాష్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకత. ఫొటో తీసేటప్పుడే కాకుండా కాల్స్‌, నోటిఫికేషన్స్‌ సమయంలోనూ   ఇది ఫ్లాష్‌ అవుతుండడం గమనార్హం. హవైన్‌ బ్లూ, ఆర్కిడ్‌ పింక్‌, బ్లాక్‌ డైమండ్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. ఫోన్‌తో పాటే ఛార్జర్‌ను కూడా ఇస్తున్నారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత హైపర్‌ఓఎస్‌తో పని చేస్తుంది. రెండు ఓఎస్‌, నాలుగేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని కంపెనీ తెలిపింది.

ఈ ఫోన్‌ (Redmi 13 5G) రెండు వేరియంట్లలో లభిస్తోంది. 6 GB ర్యామ్‌ + 128 GB స్టోరేజ్‌ ధర రూ.12,999, 8 GB ర్యామ్‌ + 128 GB స్టోరేజ్‌ ధర రూ.14,999. మైక్రోఎస్‌డీ కార్డుతో స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకోవచ్చు. కంపెనీ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్‌తో పాటు అమెజాన్‌లో ఈ ఫోన్‌ జులై 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి అందుబాటులోకి రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు