Jio 5g plans: జియో నుంచి కొత్తగా 5జీ డేటా బూస్టర్‌ ప్లాన్స్‌

Jio 5g plans: జియో కొత్తగా 5జీ బూస్టర్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. వీటితో రీఛార్జి చేసుకుంటే అపరిమిత 5జీ డేటా లభిస్తుంది.

Published : 06 Jul 2024 14:35 IST

Jio 5g plans | ఇంటర్నెట్‌ డెస్క్: ఇటీవల టెలికాం ఛార్జీలను సవరించిన జియో.. కొత్తగా 5జీ డేటా బూస్టర్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. 1జీబీ, 1.5జీబీ మొబైల్‌ డేటా ప్లాన్లు రీఛార్జి చేసిన యూజర్ల కోసం వీటిని తీసుకొచ్చింది. వారు ఈ ప్లాన్లతో రీఛార్జి చేసుకుంటే 4జీ డేటాతో పాటు అపరిమిత డేటా సేవలను ఆనందించొచ్చు.

కొత్త ప్లాన్లు తీసుకురాక ముందు 5జీ నెట్‌వర్క్‌ పరిధిలో ఉన్న 5జీ మొబైల్‌ యూజర్లందరికీ దాదాపు అన్ని ప్లాన్లపై అపరిమిత 5జీ డేటాను జియో అందించేది. ప్లాన్ల సవరణ తర్వాత 2జీబీ ప్లాన్లు రీఛార్జి చేసుకున్న వారికే అనే షరతు విధించింది. ఈ నేపథ్యంలో కొత్త ప్లాన్లను జియో తన వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. ట్రూ అన్‌లిమిటెడ్‌ అప్‌గ్రేడ్‌ సెక్షన్‌లో వీటిని పొందుపరిచింది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!

రూ.51, రూ.101, రూ.151 ధరల్లో ఈ మూడు ప్లాన్లు అందుబాటులోకి తెచ్చింది. రూ.51తో రీఛార్జి చేసుకుంటే 3జీబీ 4జీ మొబైల్‌ డేటా లభిస్తుంది. అపరిమిత 5జీ డేటాను ఆనందించొచ్చు. రూ.101 ప్లాన్‌పై 6జీబీ, రూ.151 ప్లాన్‌పై 9జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్‌ వ్యాలిడిటీనే వీటికి వర్తిస్తుంది. అయితే, రూ.479, రూ.1899 వాల్యూ ప్లాన్లకు ఈ డేటా ప్లాన్లు వర్తించవు. రూ.799 వంటి ఇతర అన్‌లిమిటెడ్‌ ప్యాక్స్‌కు వర్తిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు