Jio down: దేశవ్యాప్తంగా జియో సేవలకు అంతరాయం

Jio down: దేశవ్యాప్తంగా జియో సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు పోస్టులు పెడుతున్నారు.

Published : 18 Jun 2024 18:11 IST

Jio down | ఇంటర్నెట్‌ డెస్క్: దేశవ్యాప్తంగా జియో (Jio) టెలికాం సేవలకు అంతరాయం ఏర్పడింది. జియో మొబైల్‌ నెట్‌వర్క్‌తో పాటు జియో ఫైబర్‌ సేవలకూ అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో యూజర్లు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్ ప్రకారం.. జియో ఫైబర్‌, మొబైల్‌ ఇంటర్నెట్‌, మొబైల్‌ నెట్‌వర్క్‌ విషయంలో యూజర్లు మంగళవారం మధ్యాహ్నం నుంచి అంతరాయం ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. దీనికి గల కారణమేంటన్నది తెలియరాలేదు. దీనిపై జియో అధికారికంగా స్పందించాల్సి ఉంది. కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసినా సరిగా స్పందించడం లేదంటూ పలువురు యూజర్లు వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని