Jio 5g: రేపటి నుంచే ఆ నగరాల్లో 5జీ బీటా సేవలు.. రిలయన్స్‌ జియో ప్రకటన

దేశంలో 5జీ సేవలకు సంబంధించి రిలయన్స్‌ సంస్థ కీలక ప్రకటన చేసింది. దీపావళి కానుకగా ఈ సేవల్ని అందుబాటులోకి తెస్తామని ఇటీవల ప్రకటించిన ఆ సంస్థ ట్రయల్‌ బేసిస్‌పై దసరా నుంచే ఈ సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్టు తాజాగా వెల్లడించింది.......

Published : 04 Oct 2022 18:45 IST

ముంబయి: దేశంలో 5జీ సేవలకు సంబంధించి రిలయన్స్‌ సంస్థ కీలక ప్రకటన చేసింది. దీపావళి కానుకగా 5జీ సేవల్ని అందుబాటులోకి తెస్తామని ఇటీవల ప్రకటించిన ఆ సంస్థ.. ట్రయల్‌ బేసిస్‌పై దసరా నుంచే ఈ సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్టు తాజాగా వెల్లడించింది. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, వారణాసి నగరాల్లో ట్రయల్‌ బేసిస్‌ ఆధారంగా అక్టోబర్‌ 5నుంచి ఈ సేవలను ప్రారంభించనున్నట్టు తెలిపింది.

జియో ట్రూ 5జీ వెల్‌కం ఆఫర్‌ కింద ఈ పైన పేర్కొన్న నగరాలలో జియో యూజర్లకు బీటా ట్రయల్‌ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్‌ కింద వినియోగదారులు 5జీ అన్‌లిమిటెడ్‌ డేటాను 1జీబీపీఎస్‌ వేగంతో పొందొచ్చు. జియో ట్రూ 5జీ ప్రపంచంలోనే అత్యంత అధునాతన 5జీ సర్వీసులుగా భావిస్తున్నారు. జియో వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద ఉన్న యూజర్లు ఆటోమేటిక్‌గా జియో ట్రూ 5జీ సర్వీస్‌కు అప్‌గ్రేడ్‌ అవుతారని.. ఇందుకోసం జియో సిమ్‌గానీ, 5జీ హ్యాండ్‌సెట్‌గానీ మార్చాల్సిన అవసరం లేదని పేర్కొంది. 

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని