Prepaid Plan: రీఛార్జికి పెద్దగా ఖర్చు పెట్టలేనివారి కోసమే ఈ జియో ప్లాన్‌లు!

రూ.200లోపు రీఛార్జి ప్లాన్లు కావాలనుకునేవారికి మాత్రం జియో మంచి ప్రయోజనాలను అందిస్తోందని చెప్పొచ్చు...

Published : 11 Jun 2022 12:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో అతిపెద్ద టెలికాం సంస్థగా కొనసాగుతున్న రిలయన్స్‌ జియో.. యూజర్ల అవసరాలకు అనుగుణంగా అనేక ప్రీపెయిడ్‌ ప్లాన్లను అందిస్తోంది. అందుబాటు ధర నుంచి ప్రీమియం ప్లాన్ల వరకు అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, తక్కువ బడ్జెట్‌లో, అదీ రూ.200లోపు రీఛార్జి ప్లాన్లు కావాలనుకునేవారికి మాత్రం జియో మంచి ప్రయోజనాలను అందిస్తోందని చెప్పొచ్చు! మరి ఆ ప్లాన్‌లేంటో చూసేద్దాం..

రూ.179 ప్రీపెయిడ్‌ ప్లాన్‌..

ఈ ప్లాన్‌లో రోజుకి 1 జీబీ డేటా లభిస్తోంది. కాలపరిమితి 24 రోజులు. దీంతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉంటాయి. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌, జియో సెక్యూరిటీ సబ్‌స్క్రిప్షన్లను ఉచితంగానే పొందొచ్చు. డేటా వినియోగం పూర్తయిన తర్వాత ఇంటర్నెట్‌ వేగం 64 కేబీపీఎస్‌కు పడిపోతుంది. అయితే, ఈ ప్లాన్ కంటే కూడా అందుబాటు ధరలో మరో ప్లాన్‌ ఉంది. అదే రూ.149 ప్రీపెయిడ్‌ ప్లాన్‌.

రూ.149 ప్లాన్‌ వివరాలు..

ఈ ప్లాన్‌లోనూ రోజుకి 1జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ ఉంటాయి. అయితే, కాలపరిమితి మాత్రం 20 రోజులే. అలాగే రూ.179 ప్లాన్‌ వలే  జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌, జియో సెక్యూరిటీ సబ్‌స్క్రిప్షన్లను కూడా పొందొచ్చు. మొబైల్‌ రీఛార్జిల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేని వారిని దృష్టిలో ఉంచుకొని జియో ఈ ప్లాన్‌లను రూపొందించింది. ఇవే ప్రయోజనాలు 28 రోజుల కాలపరిమితితో కావాలనుకుంటే మాత్రం రూ.209 వెచ్చించాల్సి ఉంటుంది. అప్పుడు రూ.149, రూ.179 ప్లాన్‌లలో ఉన్న ప్రయోజనాలన్నీ 28 రోజుల పాటు పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని