Reliance Jio: జియో నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌ మాయం

ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో.. డిస్నీ+హాట్‌స్టార్‌తో కూడిన ప్రీపెయిడ్‌ ప్లాన్లను పూర్తిగా తొలగించింది.

Published : 16 Nov 2022 14:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో (Jio) డిస్నీ+హాట్‌స్టార్‌తో (Disney+ Hotstar) కూడిన ప్రీపెయిడ్‌ ప్లాన్లను పూర్తిగా తొలగించింది. డిస్నీ+హాట్‌స్టార్‌మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన కొన్ని ప్రీపెయిడ్‌ ప్లాన్లను అక్టోబర్‌లో జియో తొలగించింది. కేవలం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన రూ.1499, రూ.4199 ప్రీపెయిడ్‌ ప్లాన్లను మాత్రమే కొనసాగించింది. తాజాగా వాటినీ తొలగించింది.

రిలయన్స్‌ జియో వెబ్‌సైట్‌/ యాప్‌లో గానీ, పేటీఎం, అమెజాన్‌ పే, ఫోన్‌పే వంటి థర్డ్‌పార్టీ వేదికల్లో కూడా ఈ ప్లాన్లు ప్రస్తుతం కనిపించడం లేదు. ఇప్పటికే ఈ ప్లాన్లు యాక్టివేట్‌ చేసుకున్న వారికి మాత్రం సర్వీసులు కొనసాగుతాయి. కొత్తగా సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలనుకునే వారికి ఈ ప్లాన్లు ఇక ఎంతమాత్రం అందుబాటులో ఉండవు.

డిస్నీ+హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన బండిల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్లను ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా మాత్రం కొనసాగిస్తున్నాయి. జియో మాత్రమే తొలగించడానికి కొన్ని కారణాలున్నాయంటున్నాయి మార్కెట్‌ వర్గాలు. ఇన్నాళ్లు ఐపీఎల్‌ ప్రసార హక్కులను దక్కించుకుంటూ వచ్చిన డిస్నీ+హాట్‌స్టార్‌.. 2023 ఐపీఎల్‌ ప్రసార హక్కులను కోల్పోయింది. ఈసారి రిలయన్స్‌ గ్రూప్‌కే చెందిన వయాకామ్‌ 18 ఆ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే హాట్‌స్టార్‌ ప్లాన్లను జియో తొలగించినట్లు తెలుస్తోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts