5G auction: 5జీ వేలంలో పాల్గొనేది ఆ నాలుగు కంపెనీలే

5G auction: 5జీ టెక్నాలజీకి సంబంధించి వేలం ప్రక్రియ (5G auction) దగ్గరపడుతున్న వేళ.. ప్రీ క్వాలిఫైడ్‌ బిడ్డింగ్‌ ప్రక్రియకు అర్హత సాధించిన కంపెనీల వివరాలను కేంద్రం వెల్లడించింది.

Published : 18 Jul 2022 23:15 IST

దిల్లీ: 5జీ టెక్నాలజీకి సంబంధించి వేలం ప్రక్రియ (5G auction) దగ్గరపడుతున్న వేళ.. ప్రీ క్వాలిఫైడ్‌ బిడ్డింగ్‌ ప్రక్రియకు అర్హత సాధించిన కంపెనీల వివరాలను కేంద్రం వెల్లడించింది. ముందుగా ఊహించినట్లుగానే జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, అదానీ డేటా నెట్‌వర్క్స్‌ ఈ రేసులో నిలిచాయి. ఇందులో భాగంగా రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ (Jio) రూ.14వేల కోట్లతో ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌ (EMD)ను సమర్పించింది. రెండో అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌ ఎయిర్‌టెల్‌ రూ.5,500 కోట్లు డిపాజిట్‌ చేసింది. వొడాఫోన్‌ ఐడియా రూ.2,200 కోట్లు చేయగా.. అదానీ డేటా నెట్‌వర్క్స్‌ కంపెనీ రూ.100 కోట్లు పెట్టింది.

ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌ మొత్తం అనేది 5జీ వేలంపై ఆ కంపెనీకున్న ఆసక్తి, ప్రణాళికను తెలియజేస్తుంది. డిపాజిట్‌ మొత్తం ఆధారంగా ఎలిజిబిలిటీ పాయింట్లు సైతం కేటాయిస్తారు. ఈ విధంగా అత్యధిక మొత్తం డిపాజిట్‌ చేసినందుకు గాను జియోకు 1,59,830 పాయింట్లు కేటాయించారు. ఎయిర్‌టెల్‌కు 66,330 పాయింట్లు, వొడాఫోన్‌కు 29,370 పాయింట్లు దక్కాయి. అదానీ డేటా నెట్‌వర్క్స్‌ 1650 పాయింట్లు పొందింది. మరోవైపు ఈ నెల 26 నుంచి 5జీ వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగా హెర్జ్‌ స్పెక్ట్రాన్ని వేలానికి ఉంచనున్నారు. 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz లో ఫ్రీక్వెన్సీ బ్యాండ్లతో పాటు, 3300 MHz మిడ్‌, 26GHz హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్లకు వేలం నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని