లోటస్‌ చాక్లెట్‌లో 26 శాతం కొనుగోలుకు రిలయన్స్‌ ఓపెన్‌ ఆఫర్‌

లోటస్‌ చాక్లెట్‌లో అదనపు వాటాల కొనుగోలుకు రిలయన్స్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఫిబ్రవరి 21న ఓపెన్‌ ఆఫర్‌ ప్రారంభం కానుంది.

Updated : 06 Jan 2023 20:15 IST

దిల్లీ‌: లోటస్‌ చాక్లెట్‌ (Lotus Chocolate)  కంపెనీలో అదనపు వాటాల కొనుగోలుకు రిలయన్స్‌ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌కు సిద్ధమైంది. ఆ కంపెనీకి చెందిన రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌ (RCPL), రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (RRVL) సంస్థలు తాజాగా ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించాయి. మొత్తం 33.38 లక్షల షేర్లను రూ.115.50 చొప్పున మార్కెట్‌ నుంచి కొనుగోలు చేయనున్నారు. ఇందుకోసం రూ.38.56 కోట్లను వెచ్చించనున్నారు.

హైదరాబాద్‌కు చెందిన లోటస్‌ కంపెనీలో గత వారంలో రిలయన్స్‌ సంస్థ రూ.74 కోట్లతో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో షేరుకు రూ.113 చెల్లించి 51శాతం వాటాలు పొందింది. నిబంధనల ప్రకారం అదనపు వాటాల కొనుగోలు కోసం రిలయన్స్‌ ఈ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్రక్రియ ఫిబ్రవరి 21న మెదలై మార్చి 6న ముగుస్తుంది. మరోవైపు లోటస్‌ చాక్లెట్ షేరు ధర గురువారం మార్కెట్ ముగిసే సమయానికి రూ.149.35 వద్ద స్థిరపడింది. ఇది గత మూడునెలల్లో ఎన్నడూ లేని విధంగా షేర్‌ ధర పెరిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని