Reliance CFO: రిలయన్స్‌ సీఎఫ్‌ఓగా శ్రీకాంత్‌ వెంకటాచారి

ఆసియా అపర కుబేరుడు ముకేష్‌ అంబానీ (Mukesh Ambani) తన సంస్థ రియన్స్‌ ఇండస్ట్రీస్‌కు (Reliance Industries) సీఎఫ్‌ఓగా శ్రీకాంత్‌ వెంకటాచారిని నియమించారు.

Published : 25 Mar 2023 14:52 IST

దిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries)  చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (CFO)గా శ్రీకాంత్‌ వెంకటాచారిని నియమించారు. ప్రస్తుత సీఎఫ్‌ఓగా ఉన్న అలోక్‌ అగర్వాల్‌ (65) స్థానంలో శ్రీకాంత్‌కు బాధ్యతలు అప్పగించింది. 2005 నుంచి సీఎఫ్‌ఓగా ఉన్న అగర్వాల్‌ ఇకపై రిలయన్స్‌ సీఎండీ ముఖేష్‌ అంబానీ (Mukesh Ambani) సీనియర్‌ సలహాదారుడిగా వ్యవహరించనున్నారు. జూన్‌ 1 నుంచి వీరు కొత్త బాధ్యతలు చేపట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

గడిచిన 14 ఏళ్లుగా రిలయన్స్‌లో కొనసాగుతున్న శ్రీకాంత్‌.. గత కొన్నేళ్లుగా కంపెనీ జాయింట్‌ సీఎఫ్‌ఓగా ఉన్నారు. గతంలో సిటీ గ్రూప్‌లో పనిచేశారు. ఫారెక్స్‌ ట్రేడింగ్‌, డెరివేటివ్స్‌లో రెండు దశాబ్దాలుగా ఆయనకు అనుభవం ఉంది. ప్రస్తుత సీఎఫ్‌ఓ అగర్వాల్‌ 30 ఏళ్లుగా సంస్థకు విశిష్ట సేవలందరించారని, ఇకపై సీఎండీకి సీనియర్‌ సలహాదారుడిగా వ్యవహరిస్తారని కంపెనీ తన ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో తెలిపింది. ఆయన కంపెనీకి ఇన్నాళ్లు చేసిన సేవలను బోర్డు ప్రశంసించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు