Reliance Q2 Results: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాభాలపై విండ్‌ ఫాల్‌ ఎఫెక్ట్

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ త్రైమాసిక ఫలితాల్లో (Reliance Q2 Results) నిరాశ పరిచింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆ కంపెనీ నికర లాభం ఫ్లాట్‌గా నమోదైంది.

Published : 21 Oct 2022 20:51 IST

దిల్లీ: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ త్రైమాసిక ఫలితాల్లో (Reliance Q2 Results) నిరాశ పరిచింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆ కంపెనీ నికర లాభం ఫ్లాట్‌గా నమోదైంది. గతేడాది కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.13,680 కోట్లు కాగా.. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.13,656 కోట్లుగా నమోదైంది. అంటే లాభం 0.2 శాతం క్షీణించింది. గత త్రైమాసికంతో పోలిస్తే లాభంలో 24 శాతం క్షీణత నమోదైంది.

అదే సమయంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.2.33 లక్షల కోట్లకు చేరినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విధించిన విండ్‌ఫాల్‌ లాభాల పన్ను ప్రధానంగా రిలయన్స్ చమురు ఆదాయానికి గండి కొట్టింది. అయితే, టెలికాం రిటైల్‌, టెలికాం వ్యాపారాలు రాణించడం కలిసొచ్చింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో శుక్రవారం కంపెనీ షేరు విలువ బీఎస్‌ఈలో ఒక శాతం నష్టంతో రూ.2,471 వద్ద ముగిసింది.

జియో లాభం రూ.4518 కోట్లు

సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో జియో రూ.4,518 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది కంటే 28 శాతం వృద్ధి సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికానికి రూ.3,528 కోట్లు ఆర్జించింది. గత త్రైమాసికంతో పోల్చినప్పుడు 4 శాతం వృద్ధి నమోదైంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 20.2 శాతం వృద్ధితో రూ.22,521 కోట్లకు చేరినట్లు జియో తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.18,735 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఆదాయం 20 శాతం పెరగ్గా.. గత త్రైమాసికంతో పోలిస్తే 3 శాతం వృద్ధి నమోదైంది. కొత్త కస్టమర్ల పెరగడం, సగటు ఆదాయం పెరగడంతో కంపెనీ ఆదాయం పెరుగుదలకు దోహదం చేసింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts