Reliance campa: రిలయన్స్‌ నుంచి సాఫ్ట్‌ డ్రింక్స్‌.. మూడు రుచుల్లో మార్కెట్లోకి

Reliance Re launches campa brand: రిలయన్స్‌ నుంచి సాఫ్ట్‌ డ్రింకులు రానున్నాయి. మూడు రుచుల్లో వేర్వేరు బాటిళ్లలో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

Updated : 09 Mar 2023 18:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పటి సాఫ్ట్‌ డ్రింక్‌ బ్రాండ్‌ కాంపాను (campa) రిలయన్స్‌ సంస్థ రీలాంచ్‌ చేసింది. ప్యూర్‌ డ్రింక్‌ గ్రూప్‌ నుంచి ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేసిన రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (RCPL) గురువారం సాఫ్ట్‌ డ్రింక్‌ బ్రాండ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కాంపా కోలా, కాంపా లెమన్‌, కాంపా ఆరెంజ్‌ ఫ్లేవర్లలో ఈ డ్రింక్‌ లభించనుందని రిలయన్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 

వేసవిలో కూల్‌ డ్రింక్స్‌కు ఏర్పడనున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రిలయన్స్‌ ఈ డ్రింక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ డ్రింక్స్‌ 200ml, 500 ml, 600 ml, 1 లీటర్‌, 2 లీటర్‌ల ప్యాక్స్‌లో లభ్యమవుతాయి. 200 ఎంఎల్‌ బాటిల్‌ ధర 10 రూపాయలు కాగా.. 500 ఎంఎల్‌ బాటిల్‌ ధరను రూ.20గా నిర్ణయించారు. వీటిని ఏపీ, తెలంగాణ నుంచే వీటి విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు రిలయన్స్‌ తెలిపింది.

భారత సాఫ్ట్‌ డ్రింక్స్‌ మార్కెట్లో 1980ల్లో కాంపాదే హవా. 1990ల్లో ఎప్పుడైతే విదేశీ సంస్థలైన పెప్సీ, కోకాకోలా భారత్‌లోకి ప్రవేశించాయో ఈ బ్రాండ్‌ కనుమరుగు కావడం ప్రారంభమైంది. గతేడాది ఆగస్టులో రూ.22 కోట్లకు కాంపా బ్రాండ్‌ను ప్యూర్‌ డ్రింక్స్‌ నుంచి రిలయన్స్‌ కొనుగోలు చేసింది. ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే ఈ కొనుగోలు పూర్తి చేసింది. ఇప్పటికే విస్తారమైన రిటైల్‌ మార్కెట్‌ కలిగిన రిలయన్స్‌.. ఈ బ్రాండ్‌ను రీలాంచ్‌ చేయడం ద్వారా పెప్సీ, కోకాకోలా సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని