Updated : 18 Apr 2021 09:43 IST

తగ్గిన రెమ్‌డెసివిర్‌ ధర

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 వ్యాధి తీవ్రంగా ఉన్న బాధితుల్లో వినియోగించే ఔషధమైన ‘రెమ్‌డెసివిర్‌’ ఇంజక్షన్‌ ధర దిగివచ్చింది. కేంద్ర ప్రభుత్వం చొరవతో ధర తగ్గించేందుకు ఫార్మా కంపెనీలు అంగీకరించాయి. రెమ్‌డెసివిర్‌ ఔషధానికి కొరత ఏర్పడటం, బ్లాక్‌మార్కెట్లో అధిక ధరకు విక్రయాలు జరగటంతో ఇటీవల రోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం విదితమే. దీంతో ఈ మందును అధికంగా ఉత్పత్తి చేయటంతో పాటు ధర తగ్గించాలని ప్రభుత్వం ఫార్మా కంపెనీలకు సూచించింది. దీనికి అవి సానుకూలంగా స్పందించాయి. మనదేశంలో ఏడు ఫార్మా సంస్థలు ఈ మందు తయారు చేస్తున్నాయి.


Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని