రూ.5.45 లక్షలతో రెనో కైగర్‌ కారు

ఫ్రెంచ్ వాహన దిగ్గజం భారత మార్కెట్లో మరో కొత్త కారును విడుదల చేసింది. గతేడాది ఆవిష్కరించిన కైగర్‌ మోడల్‌ను నేడు విపణిలోకి ప్రవేశపెట్టింది. నిస్సాన్‌ మాగ్నైట్‌,

Published : 15 Feb 2021 21:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్రెంచ్ వాహన దిగ్గజం భారత మార్కెట్లో మరో కొత్త కారును విడుదల చేసింది. గతేడాది ఆవిష్కరించిన కైగర్‌ మోడల్‌ను నేడు విపణిలోకి ప్రవేశపెట్టింది. నిస్సాన్‌ మాగ్నైట్‌, హ్యుందాయ్‌ వెన్యూ, కియా సోనెట్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ 300, మారుతీ సుజుకీ విటారా బ్రెజాకు ఇది పోటీగా నిలవనుంది. ఇక ధర విషయానికి వస్తే వేరియంట్‌ను బట్టి రూ.5.45 లక్షల నుంచి రూ.9.55 లక్షల వరకు అందుబాటులో ఉంది.

కారు ముందు భాగంలో సిగ్నేచర్ టూ స్లాట్ గ్రిల్, క్రోమ్ ఇన్సర్ట్స్, సన్నటి ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌, త్రీపాడ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో పాటు ఇరువైపులా ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్ ఆకట్టుకుంటున్నాయి. వీల్ ఆర్చెస్‌పై బ్లాక్ క్లాడింగ్, డోర్ ప్యానెల్స్‌పై బ్లాక్ ప్లాస్టిక్ ఇన్సర్ట్స్, రూఫ్ రైల్స్ మరియు 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, కారు వెనుక భాగంలో సి-ఆకారపు ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, హైమౌంట్ స్టాప్ లైట్‌తో కూడిన స్పాయిలర్, వాషర్, వైపర్, సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో కూడిన డ్యూయల్ టోన్ బంపర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనిలో వివిధ రకాల సమాచారాన్ని డ్రైవర్‌కు వెంటనే తెలియజేసే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంకా ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, పీఎస్2.5 ఎయిర్ ప్యూరిఫైయర్, 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ, ఆపిల్ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రెనో కైగర్ 1.0-లీటర్ నేచురల్ పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఈ రెండు ఇంజన్లు వరుసగా 71 బీహెచ్‌పీ, 100 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తాయి. సాధారణ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్‌లతో లభ్యం కానుండగా, టర్బో పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్, ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉండనుంది. రెనో కైగర్‌ను మొత్తం ఆరు రంగులలో అందించనున్నారు. ఇందులో ఐస్ కూల్ వైట్, ప్లానెట్ గ్రే, మూన్‌లైట్ గ్రే, మహోగని బ్రౌన్, కాస్పియన్ బ్లూ మరియు రేడియంట్ రెడ్ కలర్స్ ఉన్నాయి.

ఇవీ చదవండి..

సియట్‌ టైర్ల కోసం బాబా అవతారంలో రానా

‘హింగ్లిష్‌’ కమాండ్లను అర్థం చేసుకునే ఆల్ట్రోజ్ ఐ-టర్బో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని