Bank Locker: మీకు బ్యాంకులో లాకర్ ఉందా? అయితే ఈ గడువు తేదీ మీకే..
కస్టమర్లు బ్యాంకు లాకర్లకు సంబంధించి ఈ చివరి తేదీ తప్పక గుర్తుంచుకోవాలి.
బ్యాంకు లాకర్లకు సంబంధించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఇటీవలే కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం లాకర్ వినియోగదారులు తమ లాకర్ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాలి. 2022, డిసెంబరు 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అయితే, ఈ తేది ఇప్పటికే పూర్తయినందున, కస్టమర్లు తమ కాంట్రాక్టులను పునరుద్ధరించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లాకర్ అగ్రిమెంట్ల పునరుద్ధరణ ఆవశ్యకత గురించి చాలా బ్యాంకులు ఇంకా తమ వినియోగదారులకు తెలియజేయలేదని ఆర్బీఐ గుర్తించింది. అలాగే, ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్(ఐబీఏ) రూపొందించిన నమూనా ఒప్పందాన్ని కూడా సవరించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. దీంతో ఒప్పందాలను దశలవారీగా పునరుద్ధరించేందుకు 2023, డిసెంబరు 31 వరకు గడువు పొడిగించింది.
బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్ పునరుద్ధరణ కోసం కొత్త గడువు తేదీలు..
- కస్టమర్లు బ్యాంకు లాకర్ ఒప్పందాలను పునరుద్ధరించడానికి చివరి తేదీగా 2023, డిసెంబరు 31.
- సవరించిన నియమాల గురించి బ్యాంకులు తమ కస్టమర్లు అందరికీ 2023, ఏప్రిల్ 30 లోపు తెలియజేయాలి.
- బ్యాంకులు వారి ఖాతాదారులలో 50% ఒప్పందాలను జూన్ 30, 75% ఒప్పందాలను సెప్టెంబరు 30 లోపు పునరుద్ధరించాలి.
- మోడల్ ఒప్పందాన్ని సమీక్షించి, సవరించాలని.. సవరించిన అగ్రిమెంటును ఫిబ్రవరి 28 నాటికి అన్ని బ్యాంకులకు పంపిణీ చేయాలని ఆర్బీఐ, ఐబీఏకు సూచించింది.
బ్యాంకు లాకర్లకు సంబంధించి కొత్త నిబంధనల కోసం ఈ లింక్ చేయండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: క్యాప్షన్లేని రష్మిక ఫొటోలు.. కేతిక ‘ఫిబ్రవరి ఫీల్స్’!
-
Politics News
Yuvagalam-Nara Lokesh: లోకేశ్ పాదయాత్ర.. ప్రచారరథం సీజ్ చేసిన పోలీసులు
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష తేదీ వచ్చేసింది.. దరఖాస్తు చేశారా?
-
Movies News
OTT Movies: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్
-
Sports News
Virat Kohli: ‘నువ్వు వెళ్లే మార్గం నీ మనస్సుకు తెలుసు.. అటువైపుగా పరుగెత్తు’: విరాట్ కోహ్లీ
-
General News
Polavaram: పోలవరం నిర్వాసితులకు నేరుగా నగదు బదిలీ కుదరదు: కేంద్ర జలశక్తిశాఖ స్పష్టత