Retail inflation: 18 నెలల కనిష్ఠానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

Retail inflation: దేశీయంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. ఏప్రిల్‌ నెలలో 18 నెలల కనిష్ఠానికి చేరింది. 

Published : 12 May 2023 19:12 IST

దిల్లీ: దేశీయంగా వినియోగదారుల ధరల సూచీ ఆధారిత (CPI) రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. ఏప్రిల్‌ నెలలో ఇది 18 నెలల కనిష్ఠానికి చేరి 4.7 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం సంబంధిత డేటాను శుక్రవారం వెలువరించింది. ఏప్రిల్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశించుకున్న ఆందోళనకర స్థాయికి (6 శాతం) దిగువనే ఉండడం గమనార్హం.

2021 అక్టోబర్‌లో 4.48 శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం తర్వాత భారీగా పెరిగింది. గతేడాది ఏప్రిల్‌లో ఇది 7.79 శాతంగా నమోదైంది. ఆర్‌బీఐ చర్యల కారణంగా క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చింది. ఈ ఏడాది మార్చిలో ఇది 5.66 శాతానికి తగ్గింది. ఏప్రిల్‌లో ఇది మరింత తగ్గి 18 నెలల కనిష్ఠానికి చేరింది. మార్చిలో 4.79 శాతంగా ఉన్న ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం.. ఏప్రిల్‌ నెలలో 3.84 శాతంగా నమోదైంది.

పారిశ్రామికోత్పత్తిలో స్వల్ప వృద్ధి

దేశీయంగా పారిశ్రామికోత్పత్తి సైతం స్వల్పంగా వృద్ధి చెందింది. మార్చి నెలలో 1.1 శాతం పెరిగింది. గతేడాది మార్చిలో ఇది 2.2 శాతంగా నమోదైంది. సమీక్షా నెలలో తయారీ రంగం ఉత్పత్తి 0.5 శాతం, మైనింగ్‌ రంగం ఉత్పత్తి 6.8 శాతం మేర వృద్ధి చెందగా.. విద్యుత్‌ రంగం ఉత్పత్తి 1.6 శాతం మేర క్షీణించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు