పీపీఎఫ్ తో పదవీవిరమణ చేద్దామా ...

వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం లో సమస్యలు కూడా ఎక్కువవుతాయి . కాబట్టి తగినంత సొమ్మును దాచుకోవడం మంచిది.........

Published : 21 Dec 2020 16:17 IST

వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం లో సమస్యలు కూడా ఎక్కువవుతాయి . కాబట్టి తగినంత సొమ్మును దాచుకోవడం మంచిది.

22 నవంబర్ 2019 మధ్యాహ్నం 11:33

ప్రతి వ్యక్తి పదవీవిరమణ అనంతర జీవితం కూడా ఆరోగ్యంగా , ఆనందంగా, ఎటువంటి ఆర్ధిక ఇబందులు లేకుండా సాగిపోవాలని కోరుకుంటారు. సంపాదిస్తున్న కాలం ఎక్కువ మొత్తం కుటుంబ బాధ్యతలైన పిల్లల చదువులు, వారి వివాహాలు, ఇల్లు కొట్టుకోవడం, చిన్న చిన్న విహార యాత్రలు, సామాజిక బాధ్యతలు వంటి వాటితో సరిపోతుంది. తనంత తానుగా పదవీవిరమణ నిధి కోసం జమ చేయడు . పని చేస్తున్న సంస్థ ద్వారా నెలా జీతం నుంచి కొత్త మొత్తం పీఎఫ్ లోకి జమ అవుతుంది. కొన్ని సందర్భాలలో వాటి నుంచి కూడా సొమ్ము తీసి పిల్లల చదువులు, వారి వివాహాలు, ఇల్లు కొట్టుకోవడం వంటి వాటి కోసం వాడుకోవడం జరుగుతుంది. అయితే దీనివలన సరైన పదవీవిరమణ నిధి జమ అవదు. తద్వారా నెలవారీ ఆదాయం పొందటం కష్టమౌతుంది. ఆ వయసులో పిల్లలఫై ఆధారపడటం చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. ఎందుకంటే వారికి కూడా బాధ్యతలు ఉంటాయి కాబట్టి.

అందువలన పీఎఫ్ ద్వారానే కాకుండా వేరుగా కొంత మొత్తం మదుపు చేయాలి. ఇవి దీర్ఘకాలం చేయాలి కాబట్టి అటువంటి పధకాలను ఎంచుకోవాలి. స్వల్పకాలిక లక్ష్యాల కోసం రికరింగ్ డిపాజిట్ , ఫిక్సెడ్ డిపాజిట్ లు ఏ విధంగా అనుకూలంగా ఉంటాయో, దీర్ఘకాలం కోసం పీపీఎఫ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవడం మంచిది. ఈ రెండిటి లక్షణాలు, పనితీరు, పన్ను మినహాయింపులు వేరుగా ఉన్నా, కొద్ది మొత్తంలో మదుపు చేయడానికి, మంచి రాబడికి, పన్ను మినహాయింపులు పొందడానికి అనువైనవి.

ఉదా : కృష్ణ వయసు 30 ఏళ్ళు . నెలసరి ఖర్చులు రూ 25 వేలు. కృష్ణ తన 60వ ఏట పదవీవిరమణ చేద్దామనుకొంటున్నాడు. అంటే మరొక 30 సంవత్సరాల తరువాత పనిచేసి పదవీవిరమణ తీసుకోదలిచాడు . జీవిత కాలం 80సంవత్సరాలుగా అంచనా వేసుకుంటే, పదవీవిరమణ తరువాత 20 సంవత్సరాల జీవితానికి ఇప్పటినుంచే మదుపు చేయాలి. పదవీవిరమణ తరువాత కూడా ఇదే జీవన ప్రమాణాలను పాటిద్దామనుకొంటున్నారు. దీని ప్రకారం 6 శాతం ద్రవ్యోల్బణాన్నిపరిగణన లోకి తీసుకుంటే, 30 ఏళ్ల తరువాత అంటే అతని పదవీవిరమణ నాటికి నెలకు రూ.1.45 లక్షలు అవసరమవుతాయి. ఆ వయసులో రిస్క్ సామర్ధ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి, చేసిన పొదుపును భద్రత కలిగిన పథకాలలో ఉంచి, ఆ రాబడితో ఆదాయం పొందవచ్చు. ఈ నిధిని 8 శాతం రాబడినిచ్చే పథకాలలో మదుపు చేసి, ద్రవ్యోల్బణాన్ని 6 శాతంగా పరిగణనలోకి తీసుకుంటే అతనికి కావలసిన నిధి మొత్తం రూ.3 కోట్లు.

దీనికోసం పీపీఎఫ్ పధకాన్ని ఎంచుకున్నట్లయితే ఎంత వరకు జమ చేసుకోవచ్చో ఈ కింది పట్టిక ద్వారా తెలుసుకుందాం.

ppf.jpg​​​​​​​

ప్రస్తుత ఆదాయపు పన్ను నియమాల ప్రకారం వార్షికంగా రూ. 1.50 లక్షల వరకు జమ చేయవచ్చు . అలాగే సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. ప్రభుత్వం ప్రతి ఐదు ఏళ్లకు ఒకసారి ఈ పరిమితిని పెంచుతుందని అంచనా వేస్తె, మొదటి ఐదు ఏళ్ళు ఏడాదికి రూ.1.5 లక్షలుగా, తరువాతి ఐదు ఏళ్ళు ఏడాదికి రూ.2 లక్షలుగా, ఆ తరువాతి ఐదు ఏళ్ళు ఏడాదికి రూ. 2.5 లక్షలుగా మదుపు చేస్తూ ఉంటే, ఈ 30 ఏళ్లలో రాబడి 8 శాతం గా లెక్కలోకి తీసుకుంటే , 30 ఏళ్ల తరువాత రూ. 2.80 కోట్లు జమ అవుతాయి. మిగిలిన 20 లక్షలను పీఎఫ్ నుంచి పొందొచ్చు.
పీపీఎఫ్ ఖాతా కాల పరిమితి 15 ఏళ్ళు . ఆ తరువాత కూడా 5 ఏళ్ళు చొప్పున కొనసాగించవచ్చు . 

మరిన్ని క‌థ‌నాల‌ కోసం ఈనాడు సిరి.నెట్ లో శోధించండి .
ముగింపు:
మనకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు . అదేమిటంటే, పదవీవిరమణ తరువాత ఖర్చులు తగ్గుతాయి కదా అని. అయితే వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువవుతాయి . కాబట్టి తగినంత సొమ్మును దాచుకోవడం మంచిది.
ఇంతకు మునుపు కధానాలలో పీపీఎఫ్ తో ఇంటి కొనుగోలుకు డౌన్ పేమెంట్ ఎలా చేయవచ్చో తెలుసుకున్నాము. అలాగే గృహరుణం ఈఎంఐలు ఎలా చెల్లించవచ్చో తెలుసుకున్నాము. పిల్లల ఉన్నత చదువులకోసం పీపీఎఫ్ ను ఎలా ఉపయోగించుకోవచ్చో చూసాం. ఇప్పుడు పదవీవిరమణ నిధిని ఎలా సమకూర్చుకోవచ్చో తెలుసుకున్నాం. ఈ పధకం వలన మదుపు చేసినప్పుడు, జమ అయ్యే వడ్డీ ఫై , నగదు ఉపసంహరణలపై పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. సగటున గత సంవత్సరాల వార్షిక రాబడి 8 శాతంగా ఉంది. ప్రభుత్వం తరఫున పూర్తి భద్రత కలిగినది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని