Mutual Funds: వివిధ మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల‌ రాబ‌డి!

మ్యూచువ‌ల్ ఫండ్‌లు భార‌త్‌లో పెట్టుబ‌డిదారుల కోసం అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన సంప‌ద సృష్టిక‌ర్త‌లుగా ఉద్భ‌వించాయి.

Published : 11 Aug 2022 16:23 IST

గ‌తంలో పెట్టుబ‌డిదారులు పొదుపు అంటే సాంప్ర‌దాయ‌క పొదుపు ప‌థ‌కాలైన బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీసుల్లో ఉన్న అనేక చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చేవారు. మ‌దుపుదార్ల‌కు ఈక్విటీ పెట్టుబ‌డుల‌పై గ‌తంలో పెద్ద‌గా అవ‌గాహ‌న ఉండేది కాదు. కానీ, ఇప్పుడు ఆన్‌లైన్ సౌక‌ర్యాలు పెరిగిన త‌ర్వాత ఈక్విటీల‌పై అధ్య‌య‌నం చేయ్య‌డం కూడా పెట్టుబ‌డిదారుల‌కు సుల‌భం అయ్యింది.  దీంతో ఈక్విటీల‌పై పెట్టుబ‌డులు పెట్ట‌డం ప్రారంభించారు. ప్ర‌త్య‌క్షంగా షేర్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌కుండా ఈక్విటీ మార్కెట్‌లో మదుపు చేయాలనుకునే వారు మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెడుతున్నారు. మ్యూచువ‌ల్ ఫండ్స్‌కి నిపుణులైన ఫండ్ మేనేజ‌ర్స్ ఉంటారు. వీరు పెట్టుబ‌డిదారుల త‌ర‌పున షేర్ల‌ మార్కెట్‌లోనూ, వివిధ ప్రభుత్వ పథకాల్లోనూ పెట్టుబ‌డుల‌ను పెడుతుంటారు.

మ్యూచువ‌ల్ ఫండ్‌లు గ‌త దశాబ్దంలో పెట్టుబ‌డిదారుల కోసం అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన సంప‌ద సృష్టిక‌ర్త‌లుగా ఉద్భ‌వించాయి. మ్యూచువ‌ల్ ఫండ్లు సాధార‌ణంగా 50-60 స్టాక్‌ల కంటే ఎక్కువ, కొన్నిసార్లు 100 కంటే ఎక్కువ షేర్లలో పెట్టుబడి పెడతాయి. వివిధ రకాల రంగాలలో పెట్టుబడులు పెట్టినందున రిస్క్ తగ్గుంతుంది. మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలం లో మీ ఆర్ధిక లక్ష్యాల కోసం మంచి సంపదని సృష్టించగలవు.

కొన్ని మ్యూచువ‌ల్ ఫండ్స్ 1, 3, 5, 10 సంవ‌త్స‌రాల‌లో ఇచ్చిన‌ రాబ‌డిని ఈ క్రింది ప‌ట్టిక‌ల‌లో చూద్దాం.

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ (ఓపెన్ ఎండెడ్‌, రెగ్యుల‌ర్‌, లార్జ్ క్యాప్‌) ప‌థ‌కాలలో 1, 3, 5 & 10 సంవ‌త్స‌రాల‌ రాబ‌డి

ఈ ప‌ట్టిక‌ 3 సంవ‌త్స‌రాల అధిక రాబ‌డి ప్ర‌కారం వ‌రుస క్ర‌మంలో ఇవ్వ‌బ‌డింది.

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ (ఓపెన్ ఎండెడ్‌, రెగ్యుల‌ర్‌, మిడ్ క్యాప్‌) ప‌థ‌కాలలో 1, 3, 5 & 10 సంవ‌త్స‌రాల‌లో రాబ‌డి

ఈ ప‌ట్టిక‌ 3 సంవ‌త్స‌రాల అధిక రాబ‌డి ప్ర‌కారం వ‌రుస క్ర‌మంలో ఇవ్వ‌బ‌డింది.

ఈ ప‌థ‌కాల‌ను మ్యూచువ‌ల్ ఫండ్ మేనేజ‌ర్స్ ప‌నితీరు, సగటు రాబడి, రిస్క్ ప‌రిమితి లాంటి వాటిని దృష్టిలో ఉంచుకుని ఎంచుకున్నాము. మార్కెట్ లో అనేక ఫండ్స్ అందుబాటు లో ఉన్నాయి. మీరు మ‌దుపు చేసే ముందు సొంతంగా ప‌రిశోధ‌న చేయ‌డం లేదా ఆర్థిక స‌ల‌హాదారుల‌ను సంప్ర‌దించ‌డం మేలు.

గ‌మ‌నిక: మ‌్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు మార్కెట్ రిస్క్‌కు లోబ‌డి ఉంటాయి. ఈ ఫ‌లితాలు అన్నీ ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన రాబ‌డులు మాత్ర‌మే. భ‌విష్య‌త్తుకు కొల‌మానం కాదు. న‌ష్టాలు కూడా రావ‌చ్చు. మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డి పెట్టేవారు అన్నీ ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts