Mutual funds: లార్జ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని లార్జ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం దేశంలో రిస్క్‌ను తట్టుకోగల మదుపర్లు తమ డబ్బును ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఇందులో లభించే రాబడులు ఆశాజనకంగా ఉండడంతో సంప్రదాయేతర ఇన్వెస్టర్లు కూడా మ్యూచువల్ ఫండ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ELSS ఫండ్ల తర్వాత రెండో అత్యధిక ఆస్తులు (AUM) కలిగిన పెట్టుబడులుగా లార్జ్ క్యాప్ పథకాలు ప్రజాదరణ పొందుతున్నాయి. AMFIకి సంబంధించిన 2023 ఏప్రిల్ డేటా ప్రకారం లార్జ్ క్యాప్ ఫండ్ల AUM రూ.2.40 లక్షల కోట్లకు పైగా ఉంది.
మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతులుంటాయి. బ్రోకింగ్ కంపెనీలు, పంపిణీదారుల ద్వారా ఆఫ్‌లైన్ పద్ధతి లేదా వారి ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా అయినా పెట్టుబడి చేయవచ్చు. దీన్ని రెగ్యులర్ ప్లాన్ అంటారు. ఇందులో కొంత కమీషన్ తీసుకుంటారు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్‌సైట్లు (www.mfuindia.com, www.kuvera.in, myCAMS/పేటీఎం మొబైల్ యాప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్‌లో మదుపు చేయొచ్చు. ఇందులో కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి, వీటిలో రెగ్యులర్ ప్లాన్ల కంటే 1-2 శాతం వరకు రాబడి ఎక్కువగా ఉంటుంది.
3, 5, 10 సంవత్సరాలలో 11% కంటే ఎక్కువ రాబడిని అందించే ఫండ్ల జాబితా ఇక్కడ ఉంది. 2023, మే 17 వరకు అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు.
గమనిక: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. ఇవే ఫలితాలు భవిష్యత్తులోనూ వస్తాయని హామీ లేదు. ఇందులో పెట్టుబడులు పెట్టేముందు ఆఫర్ డాక్యుమెంట్స్‌ను తప్పక చదవండి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/06/2023)
-
Ap-top-news News
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
Sports News
ఆ బౌలర్ అరంగేట్రం.. అతడికి జాక్‌పాట్
-
India News
Ashwini Vaishnaw: ఆ నంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు: టెలికాం మంత్రి
-
World News
Restaurant: ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఇలా అవమానిస్తారా..!