Investments: పెట్టుబడులను సమీక్షిస్తున్నారా?
ఏడాదికి ఒకసారైనా పెట్టుబడులను సమీక్షించాలని నిపుణులు సిఫార్సు చేస్తుంటారు.
పెట్టుబడులను తరచూ మార్చడం వల్ల చివరికి నష్టాలు మిగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా అని సమీక్ష చేయకుండా పూర్తిగా పక్కన పెట్టడమూ సరికాదు. ఏడాదికి ఒకసారైనా పెట్టుబడులను సమీక్షించాలని నిపుణులు సిఫార్సు చేస్తుంటారు.
పెట్టుబడులతో పాటు లక్ష్యాలు…
ఆర్థిక ప్రణాళిక వేసేటప్పుడు ముందుగా లక్ష్యాలను నిర్దేశించుకుంటాం. పదవీ విరమణ, పిల్లల ఉన్నత చదువులు, ఇల్లు, కారు కొనుగోలు వంటి లక్ష్యాలే దాదాపు అందరికీ ఉంటాయి. సమీక్షల ద్వారా లక్ష్యాలు ఎంత దూరంలో ఉన్నాయో బేరేజు వేసుకుని ఆ సమాయానికి లక్ష్యానికి సరిపోయే మొత్తాన్ని సమకూర్చగలమో లేదో అంచనావేయచ్చు. ఒకవేళ లేదు.. అనుకుంటే ఆర్థిక సలహాదారులను సంప్రదించి సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ విధానంలో నెలకు ఎంత పెట్టుబడి చేయాలో నిర్ణయించుకోవచ్చు. ఒక వేళ లక్ష్యానికి చేరువవుతుంటే ఎక్కువ నష్టభయం ఉండే పథకాల నుంచి తక్కువ నష్టభయం ఉండే వాటివైపు పెట్టుబడులను మళ్లించమని ఆర్థిక సలహాదారులు సూచించవచ్చు. పెట్టుబడులతో పాటు లక్ష్యాలను కూడా సమీక్షించడం వల్ల అందుకు తగ్గట్టు కేటాయింపులను పెంచడమో తగ్గించడమో చేసేందుకు అవకాశం ఉంటుంది. సిప్ లో సొమ్ము పెంచడం, తగ్గించడం పైన నిర్ణయం తీసుకోగలుగుతాం.
ఎక్కువ మొత్తం మదుపు చేసేందుకు..
కాలం గడిచే కొద్దీ సహజంగా ఎక్కువ మొత్తంలో సంపాదించాలని ఎవరికైనా ఉంటుంది. ఉద్యోగులకు ప్రతీ సంవత్సరం ఇంక్రిమెంట్ లభిస్తుంది. వృత్తి నిపుణుల ఆదాయంలో హెచ్చుతగ్గులుంటాయి. పెట్టుబడులను అప్పుడప్పుడు సమీక్ష చేయడం వల్ల నెల నెలా ఎంత ఎక్కువ మదుపు చేయవచ్చో తెలిసిపోతుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు సిప్ మొత్తాన్ని ఏడాదికోసారి లేదా ఆరు నెలల కోసారి పెంచుకునేందుకు అవకాశం ఇస్తాయి. సిప్ ప్రారంభించే సమయంలోనే ఏడాదికి ఎంత చొప్పున పెంచాలనే విషయాన్ని అడుగుతారు. ఏడాదికి రూ.వెయ్యి లేదా సిప్ విలువలో 10శాతం పెంచుకునేందుకు అవకాశాలుంటాయి.
తక్కువ రాబడికి కారణాలు
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు దీర్ఘకాలానికి ఉద్దేశించినవి. అయితే వీటిని అప్పుడప్పుడు సమీక్ష చేయడం వల్ల ఏయే ఫండ్లు ఆశించిన మేరకు ఫలితాలు ఇవ్వడం లేదో తెలుసుకోవచ్చు. మీ సలహాదారును అడిగి నిర్ణీత ఫండ్ ప్రదర్శన ఎందుకు బాగాలేదో తగిన కారణాలు తెలుసుకోండి. సదరు ఫండ్ పెట్టుబడులున్న రంగం పేలవంగా ఉండటమే దీనికి కారణం కావచ్చు. కారణాలేమైనా సరే తెలుసుకోవడం ముఖ్యం.
ఫండ్ మేనేజర్ మారితే…
కొన్ని సార్లు ఫండ్ మేనేజర్లు మారుతుంటారు. అప్పుడప్పుడు పోర్ట్‌ఫోలియోను సమీక్షిస్తుండడం వల్ల కొత్త మేనేజర్ పెట్టుబడులను ఏ విధంగా నిర్వహిస్తున్నారు తెలిసేందుకు అవకాశం ఉంది. ఒక వేళ కొత్త ఫండ్ నిర్వాహకుడితో సంతృప్తిగా లేకపోతే మరో అవకాశం కోసం చూడవచ్చు. అంటే వేరే ఫండ్‌కు మారాలనుకుంటే మారవచ్చు.
ఆన్లైన్లో సమీక్షించవచ్చు..
ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులన్నీ కాగితరహితంగా, ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. ఒకప్పుడైతే ఏజెంటు అవసరం ఉండేది. ఇప్పుడంతా ఆన్లైన్లో ఎంత పెట్టుబడులన్నాయి, రాబడి ఎంత వచ్చింది, ఏడాదికి ఎంత శాతం పెరిగింది తదితర వివరాలన్నీ తెలిసిపోతున్నాయి. ఆర్థిక సలహాదారుకు ఈ వివరాలన్నీ తెలిపి తగిన నిర్ణయం తీసుకుంటే మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!