ఎప్పటికప్పుడు సమీక్షించండి.
వాహన, ఆరోగ్య, గృహ బీమా పాలసీల మాదిరిగానే జీవిత బీమా పాలసీని కూడా కాలనుగుణంగా సమీక్షిస్తుండాలి.
జీవిత బీమాకు వార్షిక సమీక్ష అవసరమా? చాలా మంది జీవిత బీమాను తమ జీవితంలో ఒకసారి కొనుగోలు చేసి మళ్ళీ దానిని తిరిగి చూడరు. పరిశ్రమ నిణుపుల చెప్పిన దాని ప్రకారం బీమా పాలసీలను క్రమానుగతంగా సమీక్షించడం ద్వారా అసవరమైన సమయంలో ప్రయోజనాలు పొందడానికి ఆస్కారముంటుంది. అంతేకాకుండా మీ ప్రియమైన వారి భవిష్యత్తు అవసరాలకు, జీవితంలో జరిగే అనేక మార్పులకు అనుగుణంగా సంపాదనా సామర్ద్యం ఉండే విధంగా సహాయపడుతుంది. జీవిత బీమా ప్రయోజనాలు చాలా వరకు మీ మీద పూర్తిగా ఆదారపడినవారికి, మీ జీవితంలో, సంపాదనా సామర్థ్యం లో అనుకోని మార్పులు సంభవించినప్పుడు రక్షణ పొందడానికి దోహదపడతాయి.
జీవిత బీమా పాలసీని సమీక్షించవలసిన ముఖ్యమైన సందర్భాలు.
కొత్త అనుబంధం ఏర్పడినప్పుడు:
మీకు వివాహం జరిగినప్పుడు, బిడ్డ జన్మించినప్పుడు జీవిత బీమా సమీక్ష నిర్వహించాలి. మీరు ఒక కొత్త వ్యక్తిని మీ జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు మీ జీవిత బీమా పాలసీ జాబితా వివరాలను సమీక్షించడం మర్చిపోవద్దు. ఇది ఆ కొత్త వ్యక్తిని మీ జీవిత బీమా పాలసీ లబ్దిదారుల జాబితాలో చేర్చడానికి సహాయపడుతుంది. వారి వ్యక్తి గత జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని, బీమా హామీ మొత్తం అందరి భవిష్యత్తు అవసరాలకు సరిపోతుందా… లేదా అని నిర్ధారించుకోవచ్చు. ఒక వేళ హామీ మొత్తం సరిపోదని మీరు భావిస్తే, లైఫ్ స్టేజ్ ప్రొటక్షన్ కింద, చిన్న మొత్తంలో ప్రీమియం చెల్లించి బీమా హామీని మొత్తాన్ని పెంచుకోవచ్చు. లేదా మరొక కొత్త బీమా పాలసీని కొనుగోలు చేయచ్చు.
వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కుటుంబంలో కొత్తగా చేర్చినట్లయితే వారి పదవీవిరమణ అవసరాలు, ఖర్చులు గురించిన భాద్యత మీ మీదే ఉంటుంది. ఇలాంటి సందర్భంలో కూడా మీ జీవిత బీమాపాలసీని సమీక్షించుకోవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన మీరు లేకపోయినా కూడా మీ తల్లిదండ్రుల జీవితానికి భరోసా ఇవ్వగలుగుతారు.
ఉద్యోగంలో మార్పులు సంభవించినప్పుడు:
ఉద్యోగ మార్పు సాధారణంగా వ్యక్తి ఆర్థిక స్థితిలో మార్పులను తీసుకువస్తుంది. పదోన్నతి, వేతన వృద్ది, అనుకోని బోనస్ చెల్లింపులు వంటివి వచ్చినప్పుడు నూతన ఆర్ధిక నిర్ణయాలను తీసుకోవలసి ఉంటుంది. మీ ఆదాయం పెరిగినప్పుడు, మెరుగైన జీవనశైలి అవసరాల కోసం జీవిత బీమా హామీ మొత్తాన్ని పెంచుకోవాలి, పాలసీని సమీక్షించాలి. అయితే ఒకవేళ ఉద్యోగం కోల్పోతే మీ రోజు వారి ఖర్చులకు ఇబ్బంది కలుగుతుంది. ఏ కారణంగానైనా సరే ప్రీమియం చెల్లింపులను నిలిపివేయడం మంచిది కాదు. దానికి బదులుగా మీ బీమా సంస్థ అధికారులను ప్రస్తుత సంవత్సరానికి ప్రీమియం చెల్లింపులు తగ్గించమని అడుగవచ్చు.
ఆర్ధిక స్థితిలో మార్పులు:
కారు, గృహం వంటివి కొనుగోలు చేయడానికి రుణం కోసం, మీ పిల్లల చదువుల కోసం వ్యక్తిగత రుణం తీసుకోవాలని దరఖాస్తు చేసేముందు, రుణం ఈఎమ్ఐలను పరిగణలోనికి తీసుకోవాలి. క్రెడిట్ కార్డు బిల్లు వంటి స్వల్ప కాలిక రుణాలను కూడా లెక్కించాలి. ఈ విధంగా చేయడం వల్ల మీరు లేని సమయంలో మీ ప్రియమైన వారి పై రుణ భారం పడకుండా, వాటిని చెల్లించడానికి కావలసిన మొత్తాన్ని హామీ రూపంలో పొందే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆకస్మిక మరణం సంభవించినప్పుడు మీ బదులుగా బీమా సంస్థలు రుణాలను చెల్లిస్తాయి.
ఒకే సారి హామీ మొత్తాన్ని చెల్లించే పద్దతిని ఎంచుకుంటే మీపై ఆధారపడిన వారు మీ రుణాలను ఇతర డెట్లను చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని ఇతర ముఖ్యమైన అవసరాలకు వినియోగిస్తారు. ఆర్థిక అవసరాలను మరింత సమర్థవంతంగా చేరుకునేందుకు సరైన చెల్లింపు పద్దతిని ఎంచుకోవడం కూడా ముఖ్యం.
చివరిగా:
మీ జీవిత బీమా పాలసీ సమీక్షను మర్చిపోతుంటే, ఒక వార్షిక సమీక్ష ప్లాన్ చేయండి. ఇది మీ ప్రస్తుత, భవిష్యత్తు ద్రవ్యనిధి, పెట్టుబడి అవసరాల గురించి మీ ఫండ్ పనితీరుపై మీ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లానర్తో చర్చించేదుకు సులువుగా ఉండాలి. మీ భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా ఉండే కొత్త ఫీచర్లు, యాడ్-ఆన్లను గురించి క్రమానుగత అప్డేట్ను ఇవ్వవలసిందిగా బీమా సంస్థను కోరాలి. ఈ విధంగా చేయడం వలన మీ అవసరాలను సులభంగా చేరుకునేందుకు తగిన బీమా హామీ మొత్తాన్ని పెంచుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..