Income Tax: ఒక్క రూపాయి దాటితే రూ.25 వేలు భారం!
బడ్జెట్ ప్రకారం సెక్షన్ 87ఏ ప్రయోజనం రూ. 5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. ఇది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: కొత్త పన్ను విధానాన్ని (New Income tax Regime) ఎంచుకునే వారికి ఊరట కల్పిస్తూ ప్రభుత్వం పన్ను రాయితీ పరిమితిని రూ.7 లక్షలకు పెంచింది. అంటే సెక్షన్ 87ఏ కింద వచ్చే ప్రయోజనాన్ని రూ.12,500 నుంచి రూ.25,000 వేలకు పెంచింది. ఇది రూ.7 లక్షల లోపు వార్షిక ఆదాయం పొందే మధ్య తరగతి వేతన జీవులకు ఆకర్షణీయమే. అయితే, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి ఇది ప్రయోజనకరమేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రూ.7 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారిలో పాత లేదా కొత్త పన్ను విధానాల్లో ఏది ప్రయోజనకరంగా ఉంటుందనే చర్చ మొదలైంది.
పన్ను, పెట్టుబడి నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయపు పన్ను శ్లాబులను సరళీకృతం చేసేందుకు సెక్షన్ 87ఏ ప్రయోజనాన్ని పెంచారు. ఇంతకు ముందు ఈ సెక్షన్ కింద రూ.5 లక్షల వరకు ప్రయోజనం ఉండేది. తాజాగా రూ.7 లక్షలకు పెంచారు. అంటే, రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పన్ను రాయితీని పొందడం ద్వారా పన్ను చెల్లింపుల నుంచి పూర్తి మినహాయింపు పొందొచ్చు. అయితే రూ.7 లక్షలకు మించి ఒక్క రూపాయి ఆదాయం ఎక్కువగా ఉన్నా(రూ.3 లక్షల కంటే ఎక్కువ ఉన్న ఆదాయంపై) పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వీరికి సెక్షన్ 87ఏ ప్రయోజనం వర్తించదు.
పునరుద్ధరించిన కొత్త పన్ను విధానం ప్రకారం..
వార్షిక ఆదాయం రూ. 7,00,000 ఉంటే..
రూ. 7,00,001 వార్షిక ఆదాయం ఉంటే..
వార్షిక ఆదాయం రూ. 7 లక్షల పైన ఉంది కాబట్టి సెక్షన్ 87ఏ కిందకి వచ్చే రిబేట్ లభించదు. దీంతో రూ. 3,00,001 నుంచి పన్ను చెల్లించాల్సి వస్తుంది. అంటే ఆదాయంలో రూ.1 పెరిగినా రూ.25 వేలు పన్ను రూపంలో చెల్లించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.