Wealth in India: భార‌త్‌లో సంప‌న్నులు ఇంత మందేనా?

దేశంలోని మొత్తం జ‌నాభాతో పోల్చిన‌ప్పుడు, ప‌న్ను దాఖ‌లు చేసేవారి సంఖ్య చాలా త‌క్కువ‌.

Updated : 12 Aug 2022 15:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వాతంత్ర్యం పొందిన‌ప్ప‌టి నుంచి భార‌త్ చాలా ముందుకు వెళ్లింది. ఈ 75 సంవ‌త్స‌రాల స్వతంత్ర భార‌తంలో అనేక ఆర్థిక విజ‌యాల‌ను చూసింది. అంతేకాకుండా అత్యంత ఆశాజ‌న‌కంగా, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒక‌టిగా అవ‌త‌రించింది. వ్య‌క్తిగ‌త ఆదాయాల ప‌రంగా కూడా 2 ద‌శాబ్దాల క్రితం కంటే ఇప్పుడు ఎక్కువ మంది భార‌తీయులు ఆరోగ్య‌క‌ర‌మైన నెల‌వారీ ఆదాయాన్ని క‌లిగి ఉంటున్నారు.

సాధారణంగా పెరుగుతున్న ఆదాయపు పన్ను రిటర్న్ల సంఖ్య... పెరుగుతున్న దేశ సంపదను ప్ర‌తిబింబిస్తుంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జులై 31 వరకు 5.80 కోట్ల కంటే ఎక్కువ మంది ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్‌లు (ఐటీఆర్‌) దాఖ‌లు చేశారు. దేశంలోని మొత్తం జ‌నాభాతో పోల్చిన‌ప్పుడు ప‌న్ను దాఖ‌లు చేసేవారి సంఖ్య మాత్రం తక్కువనే చెప్పాలి. ప్ర‌భుత్వం కూడా వివిధ వ్యూహాల ద్వారా ఎక్కువ మందిని ప‌న్ను ప‌రిధిలోకి తీసుకురావ‌డానికి ప్రయత్నిస్తోంది.

ఆదాయ ప‌న్ను శాఖ లెక్క‌ల ప్ర‌కారం సంవ‌త్స‌రానికి రూ. 10 ల‌క్ష‌ల నుంచి రూ.1 కోటి, అంత‌కంటే ఎక్కువ సంపాదిస్తున్న భార‌తీయుల సంఖ్య ఈ ప‌ట్టిక‌లో ఉంది.

ఈ పై ఆదాయాలు వాస్త‌వ‌మేనా?
ఐటీ శాఖ లెక్క‌ల ప్ర‌కారం భార‌త్‌లో ఇంత మందే సంప‌న్నులు ఉన్నారా అంటే..? కచ్చితంగా చెప్ప‌లేం. భార‌త్‌లో ఆదాయం ఉండి కూడా ప‌న్నులు క‌ట్ట‌ని వారు వివిధ రంగాల్లో చాలా మందే ఉంటారు. వీరంతా ప‌న్ను ప‌రిధిలోకి రాకుండా చూసుకుంటారు. కానీ వాస్త‌వంగా చూస్తే పైన ప‌ట్టిక‌లో కంటే చాలా ఎక్కువ రెట్లు ఆదాయం గ‌ల‌వారు భార‌త్‌లో ఉన్నారు. పెద్ద ఎత్తున భూములు కలిగి ఉన్నా.. ఆదాయ‌పు ప‌న్ను లేదు. ప‌న్నుల విష‌యంలోనే భార‌తీయులు పేద‌వారు. కానీ వాస్త‌వ లెక్క‌ల ప్ర‌కారం సంపన్నులు ఇంకెందరో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని