Insurance: ఆరోగ్య బీమా పాలసీ ఎప్పుడు కొనుగోలు చేయాలి?
పెరుగుతున్న వైద్య ఖర్చులను కవర్ చేయడానికి ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా పథకం అవసరం. ఏ వయసులో ఎలాంటి పాలసీ కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: యుక్త వయసులో ఉండేవారు వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సహజంగానే ధీమాతో ఉండి ఆరోగ్య బీమా (Health Insurance) పాలసీని తీసుకోవడానికి నిర్లక్ష్యం చేస్తారు. కానీ, ఆరోగ్య బీమా పాలసీ ఏ వయసు వారికైనా అవసరమే. పైగా యుక్త వయసు వారికి ఉండే ఆరోగ్య పరిస్థితుల కారణంగా బీమా పాలసీ చౌకగా, వేగంగా, ఆరోగ్య పరీక్షలు లేకుండా లభిస్తుంది. మధ్యస్థ వయసువారు, వృద్ధులతో పోలిస్తే యువకులు మరింత ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇటువంటి వారికి ఆరోగ్య బీమా ప్రీమియంలు తక్కువగా ఉంటాయి. రెన్యువల్ చేసేటప్పుడు నో క్లెయిమ్ బోనస్ కూడా లభిస్తుంది.
చిన్న వయసువారికి పాలసీ అవసరమేనా?
ప్రస్తుత కాలంలో ఎంత ఆరోగ్యంగా ఉన్నట్టు కన్పిస్తున్నా జన్యుపరమైన ఇబ్బందులు, పొల్యూషన్, ఆహార అలవాట్లు, జీవనశైలి మార్పులతో అనారోగ్యానికి గురికారనే గ్యారెంటీ లేదు. గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి జబ్బులు ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే కబలిస్తున్నాయి. వీటికి ఖరీదైన ఆసుపత్రి చికిత్సలు తప్పనిసరి. అంతేకాకుండా యువకులు వాహన ప్రమాదాల బారిన పడుతుంటారు. దీనికి ఎక్కువ కాలం ఆసుపత్రి చికిత్స అవసరం పడుతుంది. ఇలాంటప్పుడే బీమా అవసరం స్పష్టంగా తెలుస్తుంది. ఈ కారణం చేతనే చిన్న వయసులో ఉన్నప్పుడే ఆరోగ్య బీమాను కొనుగోలు చేయమని బీమా నిపుణులు సూచిస్తుంటారు.
బీమా పాలసీకి సరైన వయసు ఎంత?
20-30 సంవత్సరాల మధ్య
కనీసం 20-30 ఏళ్ల మధ్యలో ఆరోగ్య బీమా కవరేజీని కొనుగోలు చేయడానికి ప్రయత్నించాలి. ఈ వయసులో ఆర్థిక సమస్యలు, బాధ్యతలు పెద్దగా ఉండవు. చెల్లింపులు చేయడానికి ఆర్థిక పరిస్థితి సహకరిస్తుంది. బీమా ప్రీమియం తక్కువగా ఉండడమే కాకుండా.. మీ బీమా అవసరాలకు గొప్ప కవరేజీని ఎంచుకోవచ్చు. మీరు త్వరలో కుటుంబాన్ని ప్రారంభించాలనుకుంటే..ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకున్నవారికి ప్రసూతి బీమా వంటి అదనపు కవరేజీ లభిస్తుంది. తక్కువ నిరీక్షణ వ్యవధిని పొందవచ్చు. అదనంగా జీవితకాల పునరుద్ధరణ ఎంపికను, 'క్యుములేటివ్ బోనస్' వంటివి సులభంగా పొందొచ్చు.
30-40 సంవత్సరాల మధ్య
ఈ వయసులో సాధారణంగా పెళ్లి, పిల్లలు, కుటుంబం ఏర్పడుతుంది. ఈ వయసు కేటగిరీలో ఆరోగ్య బీమాను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే.. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి, పిల్లలకు కూడా కవరేజీ అవసరం కావచ్చు. ఈ వయసులో ప్రస్తుత కాలంలో కన్పిస్తున్న గుండె జబ్బుల వంటి వ్యాధులకు అదనపు కవరేజీని కొనుగోలు చేస్తే మంచిది. ఆరోగ్య బీమా ప్రీమియం పెరిగే అవకాశంతో పాటు క్లెయిమ్స్ కూడా ఈ వయసు కేటగిరి వారికి ఎక్కువే ఉంటాయి.
40-50 సంవత్సరాల మధ్య
ఈ వయసు పరిధిలో ఉన్నవారు అధిక కవరేజీతో ఆరోగ్య బీమాను కొనుగోలు చేయాలి. ఎందుకంటే ఈ వయసులో అత్యంత ఆర్థిక బాధ్యతలు కలిగి ఉంటారు. పిల్లల చదువులు, ఇంటి ఈఎంఐలు వంటివి ఈ సమయంలోనే ప్రధాన ఆర్థిక బాధ్యతలుగా ఉంటాయి. వీరు, అనారోగ్యాల ఖర్చు మూలంగా కుటుంబ ఆర్థిక స్థితిని దెబ్బతినకుండా చూసుకోవాలి. షుగర్, బీపీ మొదలైన ఆరోగ్య సమస్యలు కూడా మొదలయ్యేవి ఈ వయసులోనే. అందువల్ల వీరు మెరుగైన బీమా కవరేజీని కలిగి ఉన్న విస్తృత పాలసీ పొందాల్సి ఉంటుంది. ఈ వయసు కేటగిరిలో బీమా ప్రీమియం కూడా ఎక్కువే ఉంటుంది. బీమా కాస్త ఖరీదైనా కూడా ఫ్యామిలీ ఫ్లోటర్ కవరేజీని ఎంచుకోవాలి.
50-60 సంవత్సరాల మధ్య
వీరు దీర్ఘకాలిక చికిత్సలు అవసరమయ్యే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఎక్కువ ఉంది. తరచూ ఆసుపత్రిలో చేరడం, డాక్టర్ సంప్రదింపులు కూడా అధికంగానే ఉంటాయి. ఈ వయసులో బీమా పాలసీకి భారీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వీరికి ప్రామాణిక ఆరోగ్య పాలసీ సరిపోదు, ఈ సమయంలో వీరికి సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ అవసరం. ఆయుష్ థెరపీ కవరేజీని కూడా కలిగి ఉండాలి. బీమా పాలసీ మొత్తం కూడా పెంచుకోవాలి.
60 సంవత్సరాలు, పైబడిన వయసువారు
ఈ వయసు కేటగిరిలో ఉన్నవారు, ఎక్కువ కవరేజీ ఉన్న బీమా పాలసీ తీసుకోవాలి. క్యాన్సర్‌కు సంబంధించిన చికిత్సలు, మూత్రపిండాలు, కాలేయం, గుండె మార్పిడి వంటి ప్రధాన అవయవ మార్పిడికి సంబంధించిన చికిత్సలకు ప్రముఖ కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులలో ఖర్చులు రూ.25 లక్షలు దాటుతుంటాయి. అంతేకాకుండా ఈ చికిత్సలు దీర్ఘకాలికంగా కొనసాగుతూ.. తరచూ స్క్రీనింగ్ టెస్ట్‌లు వంటి అవసరాలు ఉంటాయి. ఇలాంటి వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకుని బీమా పాలసీని ఎంచుకోవాలి. ఈ వయసు వారికి ఆరోగ్య బీమా ప్రీమియంలు చాలా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి, వీరికి వ్యక్తిగత పాలసీ మేలు. ప్రీమియం తగ్గించుకోవడానికి కొంత కో-పే ఎంచుకోవచ్చు.
చివరిగా: ఒత్తిడి లేని, ఆర్థికంగా సురక్షితమైన ఆరోగ్య జీవితాన్ని గడపడానికి ఆరోగ్య బీమా అవసరం. మీ వయసు ఎంత అన్నది ముఖ్యం కాదు. మంచి ఆరోగ్య బీమా మీ తదుపరి జీవితాన్ని ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడిపేలా చేస్తుంది. ఆరోగ్య బీమా ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి సాధ్యమైనంత చిన్న వయసు అనువైన సమయమని బీమా వర్గాలు సిఫార్సు చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
చిన్న, మధ్యస్త REITS ద్వారా స్థిరాస్తిలో పెట్టుబడులు.. సురక్షితమేనా?
తరతరాలుగా భారతీయులు స్థిరాస్తి, బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడులను గౌరవిస్తున్నారు. మారుతున్న కాలంలో స్థిరాస్తి పెట్టుబడులకు మారో రూపమే SM REITS.. వీటి గురించి తెలుసుకోండి. -
PPF vs VPF: పీపీఎఫ్, వీపీఎఫ్‌లో ఏది బెటర్..?
PPF or VPF: వాలంటరీ ప్రావిడెండ్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఏది బెటర్ అని ఆలోచిస్తున్నారా? ఈ విషయాల్ని పరిశీలించాక మీ నిర్ణయం తీసుకోండి.. -
Foreign Trip: విదేశీ టూర్‌ను ఇబ్బంది లేకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి?
విదేశీ వెకేషన్‌ను ప్లాన్ చేయడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం ఇబ్బంది లేకుండా, సజావుగా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. -
Claim Ratio: ఆరోగ్య బీమా కంపెనీల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో వివిధ బీమా సంస్థలకు సంబంధించి.. ఆరోగ్య బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
కుటుంబానికి ధీమానిచ్చేలా.. బీమా పాలసీ
సంపాదించిన మొత్తంలో నుంచి పొదుపు, పెట్టుబడులకు కొంత కేటాయిస్తుంటాం. కుటుంబానికి ఆర్థికంగా అవసరమైన లక్ష్యాల సాధనకు ఇవి ఉపయోగడేలా చూసుకుంటాం. -
పన్ను ఆదా ఇలా చేద్దాం
ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరకు వచ్చేసింది. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారు తమ పొదుపు,పెట్టుబడులను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. -
డెట్ ఫండ్లలో మదుపు చేస్తున్నారా?
ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి కనిపిస్తుండటంతో చాలామంది సురక్షిత పథకాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిలో మదుపు చేసేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలను తెలుసుకుందాం. -
Credit cards: క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్!
Credit Cards: క్రెడిట్ కార్డుల విషయంలో ఏప్రిల్ 1 నుంచి మార్పులు రానున్నాయి. రివార్డులు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో బ్యాంకులు కీలక మార్పులు చేపట్టాయి. -
Health Insurance Claims: ఆరోగ్య బీమా క్లెయిమ్ విషయంలో ఈ తప్పులు చేయొద్దు!
Insurance claims: ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు కొన్నిసార్లు తిరస్కరణకు గురవుతుంటాయి. కాబట్టి ఈ తప్పులు చేయొద్దు.. -
Health Emergency: ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి?
జీవితంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా దాన్ని ఎదుర్కోడానికి మనం ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోండి.. -
Mutual Funds: మ్యూచువల్ ఫండ్ల ఉపసంహరణ సమస్య.. ఎన్ని రోజులు పడుతోందంటే?
మార్కెట్లలో మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్లలో ఉన్న తమ నిధులను మదుపుదార్లు ఉపసంహరించుకున్నప్పుడు నిధుల బదిలీకి వివిధ సంస్థలు కొంత సమయాన్ని తీసుకుంటున్నాయి. ఎంత మొత్తం ఉపసంహరణకు.. ఎంత సమయం తీసుకుంటున్నాయో ఇక్కడ చూడండి. -
Insurance Agent: బీమా ఏజెంట్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి?
చాలా మందికి వారి వ్యక్తిగత జీవితంలో బీమా చాలా అవసరం. పాలసీ కొనుగోలు సమయంలో ఏజెంట్/అడ్వైజర్ అవసరం పడొచ్చు. వీరి గురించి ఇక్కడ తెలుసుకోండి. -
ఆరోగ్య బీమా రోజువారీ ఖర్చులను అందించేలా...
వైద్య ఖర్చులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఆరోగ్య బీమా రంగంలోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. -
స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల్లో అప్రమత్తంగా
స్టాక్ మార్కెట్ అంటేనే అనిశ్చితికి మారు పేరు. చిన్న వార్త వచ్చినా దానికి ప్రతికూలంగానో, అనుకూలంగానో స్పందిస్తుంటాయి. ఒక్క రోజులోనే మదుపరుల సంపద కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆవిరవుతుంది. -
స్థిరాస్తి రంగంలో...
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా హెచ్డీఎఫ్సీ నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) ఈ నెల 21న ముగుస్తుంది. -
Health Insurance: విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్ధుల కోసం ఆరోగ్య బీమా
విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య బీమా తప్పనిసరి. భారత్‌లో ప్రముఖ బీమా సంస్థలు విదేశీ విద్యార్థులకు అందించే బీమా సౌకర్యాలు ఇక్కడ తెలుసుకుందాం.