Vizag Steel Plant: గత రికార్డులు తిరగరాసిన స్టీల్‌ప్లాంట్‌.. అత్యధిక టర్నోవర్‌ నమోదు

Vizag Steel Plant: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌-RINL) గత రికార్డులను తిరగరాసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.28,008 కోట్లటర్నోవర్‌ను సాధించింది.

Updated : 01 Apr 2022 20:08 IST

విశాఖ: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌-RINL) గత రికార్డులను తిరగరాసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.28,008 కోట్లటర్నోవర్‌ను సాధించింది. గతేడాదితో పోలిస్తే ఇది 56 శాతం అధికం కావడం గమనార్హం. 2020-21 సంవత్సరంలో స్టీల్‌ప్లాంట్‌ రూ.17,956 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. కొవిడ్‌, బొగ్గు కొరత అవరోధాలను దాటుకుంటూ ఈ టర్నోవర్‌ను సాధించడం గమనార్హం.

2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 5.773 మిలియన్‌ టన్నుల హాట్‌ మెటల్‌, 5.272 మిలియన్‌ టన్నుల క్రూడ్‌ స్టీల్‌, 5.138 మిలియన్‌ టన్నుల సేలెబుల్‌ స్టీల్‌ను ఉత్పత్తి చేసినట్లు స్టీల్‌ప్లాంట్‌ ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం రూ.5,607 కోట్ల మేర ఎగుమతులు నమోదు చేసినట్లు పేర్కొంది. రికార్డు టర్నోవర్‌ సాధించిన సందర్భంగా స్టీల్‌ ప్లాంట్‌ ఛైర్మన్‌, ఎండీ అతుల్‌ భట్‌ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు, ఉద్యోగులు, సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని