digital payments: ఏడాదిలో 50శాతం వృద్ధి చెందిన డిజిటల్‌ పేమెంట్స్‌..!

కొవిడ్‌ వ్యాప్తి ఉన్నా , గత 12 నెలల్లో డిజిటల్‌ లావాదేవీల సంఖ్య 53శాతం పెరిగిందని ఆర్‌బీఐలోని

Published : 06 Dec 2021 14:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ వ్యాప్తి ఉన్నా , గత 12 నెలల్లో డిజిటల్‌ లావాదేవీల సంఖ్య 53శాతం పెరిగిందని ఆర్‌బీఐలోని పేమెంట్స్‌ సెటిల్మెంట్స్‌ సిస్టమ్స్‌ జీఎం పి.వాసుదేవన్‌ పేర్కొన్నారు. పేమెంట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన డిజిటల్‌ మనీ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. వాల్యూమ్‌ల లెక్కన చూస్తే వీటి వార్షిక వృద్ధిరేటు 42శాతం ఉందని వెల్లడించారు. గత ఐదేళ్లతో  పోల్చి చూస్తే మాత్రం గడిచిన 12నెలల్లో చెప్పుకోదగిన పెరుగుదల నమోదైందన్నారు. 

‘‘ప్రస్తుతం రోజువారీ 21.79 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఆర్టీజీఎస్‌ను గత డిసెంబర్‌ నుంచి 365 రోజులు అందుబాటులో ఉంచేట్లు చేశాము. ఇప్పటి వరకు వీటిని ప్రోత్సహించడానికి పలు చర్యలు చేపట్టాము. చెల్లింపు వ్యవస్థలైన ఎన్‌ఏసీహెచ్‌, భారత్‌ బిల్‌ పేమెంట్లను వారాంతాల్లో కూడా అందుబాటులోకి తెచ్చాము. ఫలితంగా ఈ వ్యవస్థల్లో సెటిల్మెంట్‌ సమస్యలను తీర్చాము’’ అని వాసుదేవన్‌ వెల్లడించారు. 

పేమెంట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్‌లో  సృజనాత్మకతను పెంచడంపైనే సాగింది. మొత్తం 2,500 మంది అతిథులు 30 సెషన్లలో పాల్గొన్నారు. చెల్లింపు సేవల రంగంలోని వారు సృజనాత్మకత ఆధారంగా లావాదేవీలను సుస్థిరంగా ఏవిధంగా పెంచవచ్చు అనే అంశాలను చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని