పని ఒత్తిడి తట్టుకోలేక రోబో సూసైడ్‌?

దక్షిణ కొరియాలో ఓ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. పని ఒత్తిడి తాళలేక ఓ రోబో సూసైడ్‌ చేసుకుంది!

Updated : 05 Jul 2024 19:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పని ఒత్తిడి, పని ప్రదేశాల్లో వేధింపులు వంటివి భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటనల గురించి వింటుంటాం. ఇలాంటి ఫీలింగ్స్‌ మనుషులకే కాదు రోబోలకు కూడా కలుగుతాయా? అవి కూడా ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాయా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. కొరియాలో తాజాగా జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. 

దక్షిణ కొరియాలోని గుమి సిటీ కౌన్సిల్‌లో ఓ రోబో సివిల్‌ సర్వెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఇటీవల మెట్ల మీద నుంచి కిందకు పడిపోయింది. భవనం మొదటి, రెండో అంతస్తుల మధ్య ఉన్న మెట్ల మార్గంలో కూలబడిపోయింది. ఈ ఘటనకు ముందు రోబో విచిత్రంగా ప్రవర్తించిందని అక్కడే ఉన్న ఉద్యోగులు తెలిపారు. ఏదో వెతుకుతున్నట్లుగా అటూ ఇటూ తిరుగుతూ ఉండేదని పేర్కొంటున్నారు. నిర్విరామంగా పనిచేసి విచిత్రంగా వ్యవహరించాక ఇలా నిర్వీర్యం కావడంతో రోబో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పేర్కొంటున్నారు. దీంతో ఈ వ్యవహారం నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది.

ప్రపంచంలోనే తొలి CNG బైక్‌ వచ్చేసింది.. ధర, ఇతర వివరాలు ఇవే..!

ఈ ఘటనపై సిటీ కౌన్సిల్‌ అధికారులు తక్షణమే స్పందించారు. దీనిపై విచారణ చేపడుతున్నట్లు ప్రకటించారు. కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్‌ కంపెనీ బేర్‌ రోబోటిక్స్‌ ఈ రోబోను రూపొందించింది.  ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా విధులు నిర్వర్తించేది. పనిలో విసుగు చెందడం వల్లే రోబో ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. దక్షిణ కొరియాలో రోబోల వినియోగం ఎక్కువ. ప్రతి పది మంది ఉద్యోగులకు సాయం చేసేందుకు ఓ రోబో ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని