Royal Enfield: విభిన్నమైన ఎలక్ట్రిక్‌ బైక్స్‌ను అభివృద్ధి చేస్తున్నాం: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌

విద్యుత్‌ వాహనాల (Electric Vehicles) తయారీ సహా వివిధ మోడళ్ల అభివృద్ధి కోసం ఈ ఏడాది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ (Royal Enfield) రూ.1,000 కోట్ల మూలధన వ్యయాన్ని ప్రకటించింది.

Published : 21 May 2023 16:49 IST

దిల్లీ: విభిన్నమైన విద్యుత్తు మోటార్‌సైకిల్స్‌ (Electric Bike)ను అభివృద్ధి చేస్తున్నామని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ (Royal Enfield) ప్రకటించింది. ఇప్పటికే దీనిపై పనులు ఊపందుకున్నాయని సీఈఓ బి.గోవిందరాజన్‌ తెలిపారు. ఈ మేరకు చెన్నైలోని ప్లాంట్‌లో తయారీకి కావాల్సిన మార్పులను కూడా ప్లాన్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.

విద్యుత్‌ వాహనాల (Electric Vehicles) తయారీ సహా వివిధ మోడళ్ల అభివృద్ధి కోసం ఈ ఏడాది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ (Royal Enfield) రూ.1,000 కోట్ల మూలధన వ్యయాన్ని ప్రకటించింది. దీంట్లో కొంత భాగాన్ని పెట్రోల్‌తో నడిచే బైక్‌ల అభివృద్ధికి కూడా కేటాయించనున్నట్లు తెలిపింది. ఈవీ బైక్‌ (Electric Bike)ల అభివృద్ధి కోసం కంపెనీ సమర్థమైన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు గోవిందరాజన్‌ తెలిపారు. ఇప్పటికే చాలా నమూనాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. వాటి టెస్టింగ్‌ కూడా ముమ్మరంగా సాగుతున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని