Royal Enfield: బ్రేక్‌లో సమస్య.. 26 వేలకుపైగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ల రీకాల్‌

వెనుక బ్రేక్‌లో సమస్య కారణంగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ‘క్లాసిక్ 350’ మోడల్‌కు చెందిన 26,300 వాహనాలను రీకాల్ చేసింది.

Published : 20 Dec 2021 13:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెనుక బ్రేక్‌లో సమస్య కారణంగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ‘క్లాసిక్ 350’ మోడల్‌కు చెందిన 26,300 వాహనాలను రీకాల్ చేసింది. ఈ మేరకు సోమవారం సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సియామ్‌), రోడ్డు రవాణా, రహదారులశాఖకు సమాచారం అందించింది. అత్యవసర సమయాల్లో వెనుక బ్రేక్ పెడల్‌ను గట్టిగా నొక్కినప్పుడు రెస్పాన్స్‌ బ్రాకెట్‌ దెబ్బతినే అవకాశం ఉండటం, పైగా శబ్దం వెలువడటం, బ్రేకింగ్ సామర్థ్యం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉన్నందున వాటిని రీకాల్‌ చేసినట్లు సంస్థ వెల్లడించింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌లో అత్యధికంగా అమ్ముడయ్యేవి క్లాసిక్‌ 350 మోడల్‌ బైక్‌లే.

ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్య తయారైన సింగిల్-ఛానల్ ఏబీఎస్‌, రియర్‌ డ్రమ్ బ్రేక్ క్లాసిక్ 350 బైక్‌లలో మాత్రమే ఈ సమస్య ఉన్నట్లు సంస్థ వివరించింది. వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్(వీఐఎన్‌) ఆధారంగా సర్వీస్‌ బృందాలు, స్థానిక డీలర్లు సంబంధిత వినియోగదారులను సంప్రదిస్తారని చెప్పింది. ‘డెవలప్‌మెంట్‌, టెస్టింగ్, నాణ్యత, మన్నిక విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలు తలెత్తొచ్చు. వీటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని సంస్థ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని