SS Rajamouli: దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కొత్త కారిదే.. ధరెంతో తెలుసా?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విజయోత్సాహంలో ఉన్న దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తన గ్యారేజ్‌లోకి కొత్త కారును ఆహ్వానించారు....

Updated : 23 Apr 2022 16:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విజయోత్సాహంలో ఉన్న దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తన గ్యారేజ్‌లోకి కొత్త కారును ఆహ్వానించారు. భద్రతకు పెట్టింది పేరైన వోల్వో కంపెనీకి చెందిన ‘ఎక్స్‌సీ40’ అనే విలాసవంతమైన ఎస్‌యూవీని ఇటీవల కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన చిత్రాన్ని వోల్వో కంపెనీ తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఉంచింది. కంపెనీ ప్రతినిధి నుంచి ఎరుపు రంగులో ఉన్న ఎక్స్‌సీ40ని రాజమౌళి డెలివరీ తీసుకుంటున్నట్లు ఆ చిత్రంలో ఉంది. దీని ధర రూ.44.50 లక్షలు (దిల్లీ, ఎక్స్‌షోరూం). ఆ కారు విశేషాలేంటో చూద్దాం...

డిజైన్‌ ఇలా..

వోల్వో ఎక్స్‌సీ40 డిజైన్‌ విషయానికి వస్తే, ఇందులో కంపెనీ సిగ్నేచర్ టి-ఆకారపు డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, 18 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌, కారు చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్‌తో ఈ కారు ఆకర్షణీయ లుక్‌ని కలిగి ఉంది. నిలువుగా ఉండే టెయిల్‌ల్యాంప్స్‌, డ్యుయల్ టోన్ ఎక్స్టీరియర్ కలర్స్‌తో ఆకట్టుకుంటోంది. 

ఇంటీరియర్స్‌ ఎలా ఉన్నాయంటే..

లోపలి భాగంలో పియానో బ్లాక్, అల్యూమినియం పెయింట్ స్కీమ్‌ ఫినిష్‌ను ఇచ్చారు. టచ్‌స్క్రీన్ చుట్టూ అల్యూమినియం యాక్సెంట్స్‌ను అమర్చారు. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు, పానరోమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం కలిగిన 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌ను పొందుపరిచారు. ఎంఐడీ టచ్‌స్క్రీన్, డిస్టెన్స్ అలెర్ట్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ అసిస్ట్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. 

ఇంజిన్‌, భద్రతా ఫీచర్లు..

వోల్వో ఎక్స్‌సీ40 కారులో 2.0 లీటర్ 4-సిలిండర్ ఇంజిన్‌తో వస్తోంది. ఈ ఇంజన్ గరిష్ఠంగా 187 బీహెచ్‌పీ శక్తిని, 300 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తోంది. యాంబియంట్ లైటింగ్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లతో పాటు క్రూజ్‌ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్టెంట్, పార్క్ అసిస్ట్ కెమెరా, హిల్ స్టార్ట్, డిసెంట్ కంట్రోల్, కొల్లిజన్‌ మిటిగేషన్ సపోర్ట్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. భారత మార్కెట్లో వోల్వో ఎక్స్‌సీ40, మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌ఏ, బీఎండబ్ల్యూ ఎక్స్1, ఆడి క్యూ3 వంటి వాటితో పోటీ పడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని