భారీగా పన్ను ఎగవేసిన పాన్‌మసాలా సంస్థ
అక్రమంగా పాన్ మసాలా తయారు చేయటమే కాకుండా.. ఏకంగా ఎనిమిది వందల కోట్లకు పైగా పన్నులు ఎగవేసిన ఓ సంస్థ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ..
దిల్లీ: అక్రమంగా పాన్ మసాలా తయారు చేయటమే కాకుండా.. ఏకంగా ఎనిమిది వందల కోట్లకు పైగా పన్నులు ఎగవేసిన ఓ సంస్థ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్టు కేంద్ర వస్తు సేవల పన్ను (జీఎస్టీ) శాఖ అధికారులు తెలిపారు. అధికారిక అనుమతులు, రిజిస్ట్రేషన్ వంటివేవీ లేకుండానే సదరు సంస్థ గుట్కా, పాన్ మసాలా వంటి ఉత్పత్తులను తయారు చేసి.. వివిధ రాష్ట్రాలకు రహస్యంగా సరఫరా సాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
పశ్చిమ దిల్లీ ప్రాంతంలోని బుద్ధ విహార్‌లో సంస్థ గోడౌన్లో జరిపిన సోదాల్లో లభించిన యంత్రాలు, ముడి సరకు, తయారైన ఉత్పత్తులు లభించాయి. ఈ వస్తువుల విలువ రూ.4.14 కోట్లు ఉండవచ్చని అధికారులు తెలిపారు. అనుమతుల్లేని ఈ సంస్థలో 65 మంది పనిచేస్తున్నట్టు కూడా వారు వివరించారు. ఇక్కడి స్టాకును సీజ్ చేసి, రూ.831.72 కోట్ల మేరకు పూర్తి స్థాయి పన్ను ఎగవేతకు పాల్పడినట్టు అంగీకరించిన లిఖిత పూర్వకంగా స్టేట్మెంట్ను నమోదు చేశారు. ఈ అంశంపై విచారణ కొనసాగుతుందని అధికారులు వివరించారు.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Bollywood: స్టార్ హీరోపై నెటిజన్ల ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలంటూ ట్వీట్లు
-
Sports News
Aaron Finch: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆసీస్ టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ గుడ్‌బై!
-
Movies News
OTT Movies: బొమ్మ మీది.. స్ట్రీమింగ్ వేదిక మాది.. ఇప్పుడిదే ట్రెండ్!
-
World News
EarthQuake: భూకంపం ధాటికి.. రెండు ముక్కలైన ఎయిర్‌పోర్టు రన్‌వే
-
Politics News
Andhra News: బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని తగులబెట్టిన దుండగులు
-
Sports News
Ashwin - Australia: అశ్విన్‌ను చూస్తే ఆస్ట్రేలియాకు కంగారు ఎందుకు?.. సమాధానం ఇదిగో!