ఎన్‌పీఎస్ పాక్షిక ఉపసంహరణ నియమాలు..

వ్యవస్థలో చేరిన తేదీ నుంచి మూడేళ్ల తర్వాత ఎన్‌పీఎస్ చందాదారులు పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు....

Published : 22 Dec 2020 17:20 IST

వ్యవస్థలో చేరిన తేదీ నుంచి మూడేళ్ల తర్వాత ఎన్‌పీఎస్ చందాదారులు పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు.

నేషనల్ పెన్షన్ స్కీమ్ చందాదారులు కరోనా వైరస్ చికిత్సకు సంబంధించిన ఖర్చులను భరించటానికి ఇప్పుడు పాక్షిక ఉపసంహరణను అనుమతిస్తామని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఆర్‌డీఏ) తెలిపింది. "COVID-19 ను మహమ్మారిగా ప్రకటించిన భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దృష్ట్యా, COVID-19 ను ప్రాణాంతక అనారోగ్యంగా ప్రకటించాలని నిర్ణయించామని, ఇది ప్రకృతిలో ప్రాణాంతకమని పీఎఫ్‌ఆర్‌డీఏ తెలిపింది. చందాదారుడు, అతని జీవిత భాగస్వామి, పిల్లలు, చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లలు లేదా వారిపై ఆధారపడిన తల్లిదండ్రుల చికిత్సకు పాక్షిక ఉపసంహరణ అనుమతిస్తారు. ఎన్‌పీఎస్ నుంచి పాక్షికంగా ఉపసంహరించుకునేందుకు ఉన్న ఇతర నియమాలు యధావిధంగా ఉంటాయి.

ఎన్‌పీఎస్ నుంచి పాక్షిక ఉపసంహరణ గురించి తెలుసుకోవాల్సిన 5 విషయాలు కింద ఉన్నాయి :

  1. కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో, వ్యవస్థలో చేరిన తేదీ నుంచి మూడేళ్ల తర్వాత ఎన్‌పీఎస్ చందాదారులు పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు.
  1. ఉన్నత విద్య / పిల్లల వివాహం, ఇంటి కొనుగోలు / నిర్మాణం (నిర్ధిష్ట పరిస్థితులలో), క్లిష్టమైన అనారోగ్యాల చికిత్స కోసం పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఉంది.

  2. ఎన్‌పీఎస్ కింద చందాదారుడు మొత్తం కాలపరిమితిలో పాక్షిక ఉపసంహరణను గరిష్టంగా మూడుసార్లు చేయవచ్చు.

  3. ఉపసంహరణ కోసం దరఖాస్తు చేసిన తేదీ నాటికి చందాదారుడు చేసిన మొత్తం కాంట్రిబ్యూషన్ లో గరిష్టంగా 25 శాతం పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఉంటుంది.

  4. ఎన్‌పీఎస్ చందాదారుడు పాక్షిక ఉపసంహరణ అభ్యర్థనను ఆన్‌లైన్‌లో చేయవచ్చు, లేదా చందాదారుడు పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ సర్వీస్ ప్రొవైడర్లకు పత్రాలతో పాటు భౌతిక పాక్షిక ఉపసంహరణ ఫారమ్‌ను కూడా సమర్పించవచ్చు, దీని ఆధారంగా ప్రెజెన్స్ సర్వీస్ ప్రొవైడర్లు ఆన్‌లైన్ అభ్యర్థనను ప్రారంభించవచ్చు. కరోనా వైరస్ చికిత్స కోసం పాక్షిక ఉపసంహరణ విషయంలో "నోడల్ ఆఫీస్ / పీఓపీలు / అగ్రిగేటర్లు చందాదారుడు వైద్య ధృవీకరణ పత్రాన్ని, పాక్షిక ఉపసంహరణకు సంబంధించిన అధికారిక అభ్యర్థనను అందించారని నిర్ధారిస్తారని పీఎఫ్‌ఆర్‌డీఏ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని