Rupee value: బక్క చిక్కుతున్న రూపాయి... 8 ఏళ్లలో 25% క్షీణత

Rupee value:  2014 డిసెంబర్‌ 31 నాటికి రూపాయి విలువ 63.33గా ఉండగా.. 2022 జులై 11 నాటికి అది 79.41కి చేరింది. 

Updated : 18 Jul 2022 20:22 IST

దిల్లీ: రూపాయి విలువ (Rupee value) బక్క చిక్కుతోంది. డాలరుతో పోలిస్తే దీని విలువ రోజురోజుకు పతనమవుతోంది. ఇప్పుడు దాదాపు 80కి చేరువైంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీని విలువ ఏకంగా 25 శాతం మేర క్షీణించింది. 2014 డిసెంబర్‌ 31 నాటికి రూపాయి విలువ 63.33గా ఉండగా.. 2022 జులై 11 నాటికి అది 79.41కి చేరింది. ఈ విషయాన్ని ఆర్‌బీఐ గణాంకాలను ఉదహరిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే స్వయంగా పార్లమెంట్‌ వేదికగా సోమవారం వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రశ్నకు ఆమె లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

Also Read: రూపాయి పతనానికి ఆర్‌బీఐ అడ్డుకట్ట.. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలివే..

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, క్రూడాయిల్‌ ధరలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు రూపాయి విలువ క్షీణించడానికి గల కారణాలుగా నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. బ్రిటీష్‌ పౌండ్‌, జపనీస్‌ యన్‌ విలువ కూడా క్షీణించాయని తెలిపారు. యూరో విలువ రూపాయి కంటే దారుణంగా పడిపోయిందని తెలిపారు. అదే సమయంలో ఈ కరెన్సీతో పోల్చినప్పుడు రూపాయి బలపడిందని పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులు తరలిపోవడం కూడా మరో ముఖ్య కారణమని చెప్పారు. ఒక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23)లోనే సుమారు 14 బిలియన్‌ డాలర్ల విలువైన పెట్టబడులను విదేశీ మదుపరులు ఉపసంహరించుకున్నారని పేర్కొన్నారు. రూపాయి బలపడేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నట్లు నిర్మలా సీతారామన్‌ వివరించారు.

Also Read: ధరలు మండుతున్నా... డాలరుదే హవా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని