RuPay forex card: త్వరలో రానున్న రూపే ఫారెక్స్‌ కార్డులు

విదేశాలలో ఏటీఎంలు, పీఓఎస్‌ మెషీన్లు, ఆన్‌లైన్‌ వ్యాపారుల వద్ద ఉపయోగించడానికి రూపే ఫారెక్స్‌ కార్డులు త్వరలో రానున్నాయి.

Published : 08 Jun 2023 23:14 IST

భారతదేశంలోని బ్యాంకులు జారీ చేసే రూపే డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు అంతర్జాతీయ భాగస్వాములతో ద్వైపాక్షిక ఒప్పందాలు ద్వారా, అంతర్జాతీయ కార్డ్‌ పథకాలతో సహ బ్యాడ్జింగ్‌ ఏర్పాట్లతో అంతర్జాతీయ ఆమోదం పొందాయి. అంతర్జాతీయంగా ఉపయోగించడానికి వీలున్న రూపే ఫారెక్స్‌ కార్డులను త్వరలో జారీ చేయనున్నారు. విదేశీ ఏటీఎంలు, పీఓఎస్‌ మెషీన్లు, ఆన్‌లైన్‌ వ్యాపారుల వద్ద వీటిని ఉపయోగించవచ్చు. దీంతో రూపే డెబిట్‌, క్రెడిట్‌, ప్రీపెయిడ్‌ కార్డ్‌లను విదేశాలలో జారీ చేయడానికి, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించడానికి అనుమతి ఉంటుంది.  విదేశాలకు వెళ్లే భారతీయులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. రూపే ప్రీపెయిడ్‌ ఫారెక్స్‌ కార్డ్‌లు భారతదేశంలోనే కాక, ఇకనుంచి అంతర్జాతీయంగా కూడా వినియోగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రూపే కార్డ్‌ల ప్రపంచవ్యాప్త విస్తరణ కోసం భూటాన్‌, సింగపూర్‌, నేపాల్‌, యూఏఈ ఇతర అంతర్జాతీయ కార్డ్‌ స్కీమ్‌లతో సహ-బ్రాండింగ్‌ లేకుండా రూపే కార్డులను అంగీకరించడానికి ఏర్పాట్లు జరిగిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని