Rupee value: ఇతర దేశాల కరెన్సీ కంటే మన రూపాయి మెరుగే: నిర్మలా సీతారామన్‌

రూపాయి పతనంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే అమెరికా డాలరుతో రూపాయి బాగానే రాణిస్తోందని చెప్పారు.

Published : 24 Sep 2022 20:43 IST

పుణె: రూపాయి పతనంపై (Rupee) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే అమెరికా డాలరుతో రూపాయి బాగానే రాణిస్తోందని చెప్పారు. డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పతనమైన నేపథ్యంలో ఇక్కడ ఆమె విలేకరులతో మాట్లాడారు. రిజర్వ్‌ బ్యాంక్‌, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయని చెప్పారు. ఇతర కరెన్సీల్లా తీవ్రమైన ఒడుదొడుకులు, హెచ్చుతగ్గులకు గురికాలేదంటే అది భారత రూపాయేనని చెప్పారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే మనం బాగా నిలబడ్డామన్నారు. రూపాయి విలువ ఎప్పుడూ లేనంతగా జీవిత కనిష్ఠానికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీయ కరెన్సీ విలువను కాపాడేందుకు ఆర్‌బీఐ ఫారెక్స్‌ నిల్వలను విక్రయించొచ్చన్న అంచనాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని