Crude Oil: భారత్‌కు చమురు సరఫరాలో రష్యాదే అగ్రస్థానం

Crude Oil: భారత్‌కు చమురు సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో అక్టోబరులో అగ్రస్థానానికి చేరిన రష్యా వరుసగా రెండో నెల అయిన నవంబరులోనూ ఆ జోరును కొనసాగించింది.

Published : 11 Dec 2022 12:17 IST

దిల్లీ: వరుసగా రెండో నెలా అయిన నవంబరులో భారత్‌కు అతిపెద్ద చమురు (Crude Oil) సరఫరాదారుగా రష్యా (Russia) నిలిచింది. ఇంధన సరఫరా వివరాలను వెల్లడించే వోర్టెక్సా ప్రకారం.. సౌదీ అరేబియా, ఇరాక్‌ స్థానాలను రష్యా అధిగమించింది. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత చమురు (Crude Oil) దిగుమతుల్లో రష్యా (Russia) వాటా 0.2 శాతం మాత్రమే. అక్టోబరులో రోజుకు 9,35,556 పీపాల చమురు (Crude Oil)ను భారత్‌కు అందించి తొలి స్థానానికి చేరింది. నవంబరులోనూ అదే జోరు కొనసాగిస్తూ రోజుకు 9,09,403 పీపాల చమురును భారత్‌కు సరఫరా 

నవంబరులో భారత్‌ దిగుమతి చేసుకున్న మొత్తం చమురు (Crude Oil)లో ఐదు వంతు వాటా రష్యాదే. ఇరాక్‌ నుంచి రోజుకు 8,61,461 పీపాలు, సౌదీ అరేబియా నుంచి 5,70,922 పీపాలు, అమెరికా నుంచి 4,05,525 పీపాల చమురు దిగుమతి అయ్యింది. ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాతే రష్యా (Russia) నుంచి భారత్‌కు చమురు (Crude Oil) దిగుమతి గణనీయంగా పెరిగింది. పశ్చిమ దేశాలు ఆ దేశ చమురు ఎగమతులపై ఆంక్షలు విధించడంతో రాయితీ ధరకు విక్రయించేందుకు రష్యా ముందుకు వచ్చింది. దీన్ని అవకాశంగా మల్చుకున్న భారత్‌ భారీ ఎత్తున దిగమతులను పెంచుకుంది. డిసెంబరు 2021లో రష్యా నుంచి భారత్‌కు రోజుకి 36,255 పీపాల చమురు మాత్రమే వచ్చింది. అదే ఇరాక్‌ నుంచి 1.05 మిలియన్లు, సౌదీ అరేబియా 9,52,625 బ్యారెళ్ల చమురు దిగుమతి అయ్యింది.

ఈ ఏడాది మార్చిలో రష్యా నుంచి భారత్‌కు రోజుకు 68,600 పీపాల చమురు దిగుమతి అయ్యింది. మే నెలలో అది 2,66,617 పీపాలకు పెరిగింది. జూన్‌ నాటికి గరిష్ఠంగా 9,42,694 పీపాలకు చేరింది. అయినప్పటికీ ఆ నెలలో రోజుకు 1.04 మిలియన్‌ పీపాలతో ఇరాక్‌ అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది. రష్యా రెండో స్థానానికి చేరింది. రష్యా నుంచి భారత్‌ చమురును దిగుమతి చేసుకోవడాన్ని పాశ్చాత్య దేశాలు విమర్శించినప్పటికీ.. భారత్‌ మాత్రం దీటుగా సమాధానం చెప్పింది. ఇటీవల కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ మాట్లాడుతూ.. భారత ప్రజల ప్రయోజనాలే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. అందుకోసం అందుబాటులో ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటామని తేల్చి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని