హిందుజా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎస్పీ హిందుజా కన్నుమూత

హిందుజ గ్రూప్‌ ఛైర్మన్‌ శ్రీచంద్‌ పరమానంద్‌ హిందుజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లండన్‌లో తుదిశ్వాస విడిచారు.

Updated : 17 May 2023 21:20 IST
దిల్లీ: హిందుజా గ్రూప్‌ ఛైర్మన్‌, హిందుజా సోదరుల్లో ఒకరైన శ్రీచంద్‌ పరమానంద్‌ హిందుజా (87) (S P Hinduja) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లండన్‌లో బుధవారం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్పీ హిందుజా మరణంపట్ల ఆయన సోదరులు గోపిచంద్‌, ప్రకాశ్‌, అశోక్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. హిందుజా బ్రదర్స్‌ నలుగురిలో అందరి కంటే పెద్దవారైన ఎస్పీ హిందుజా 1935 నవంబర్ 28న బ్రిటిష్ ఇండియాలోని సింధ్ ప్రావిన్స్‌లోని కరాచీలో జన్మించారు.  హిందుజాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో ఎస్పీ హిందుజా సతీమణి మధు కన్నుమూశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు