Samsung F14 5G: బిగ్‌ బ్యాటరీతో ₹13 వేలకే శాంసంగ్‌ 5జీ ఫోన్‌!

Samsung Galaxy F14 5G: శాంసంగ్‌ గెలాక్సీ F14 5జీ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో శుక్రవారం విడుదల చేసింది. మార్చి 30 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి.

Updated : 25 Mar 2023 00:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. గత  కొంతకాలంగా తక్కువ బడ్జెట్‌లో ఫోన్లను తీసుకొస్తున్న ఆ సంస్థ.. ఇప్పుడు శాంసంగ్‌ గెలాక్సీ F14 (Samsung Galaxy F14 5G) పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. మూడు రంగుల్లో వీటిని లాంచ్‌ చేసింది. మార్చి 30 నుంచి విక్రయాలు ప్రారంభం కానుంది. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయాలతో తక్కువ బడ్జెట్‌లో ఈ 5జీ ఫోన్‌ను తీసుకురావడం గమనార్హం.

శాంసంగ్‌ గెలాక్సీ F14 రెండు వేరియంట్లలో వస్తోంది. 4జీబీ+128 జీబీ వేరియంట్‌ ధరను రూ.12,900గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ+128 జీబీ వేరియంట్‌ ధరను రూ.14,900గా కంపెనీ పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌, ఇతర ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు. శాంసంగ్‌ గెలాక్సీ F14 నలుపు, ఆకుపచ్చ, ఊదా రంగుల్లో లభించనుంది. మార్చి 30 మధ్యాహ్నం నుంచి ఈ మొబైల్స్‌ కొనుగోలుకు అందుబాటులోకి వస్తాయి.

ఇందులో 6.6 అంగుళాల పుల్‌ హెచ్‌డీ+ ఐపీఎస్‌ ఎల్‌ఈడీ అమర్చారు. 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో ఈ డిస్‌ప్లే పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 13తో కూడిన వన్‌యూఐ 5తో వస్తోంది. వెనక వైపు 50 మెగాపిక్సల్‌ కెమెరాతో పాటు 2 ఎంపీ డెప్త్‌ కెమెరా అమర్చారు. ముందు వైపు సెల్ఫీల కోసం 13 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 5జీ, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌, గొరిల్లా గ్లాస్‌5 ప్రొటెక్షన్‌ ఇచ్చారు. 6,000mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్‌ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. వినియోగదారులు 6 జీబీ వర్చువల్‌ మెమొరీగా వాడుకోవచ్చు. రెండు ఆండ్రాయిడ్‌ ఆప్‌డేట్లను, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని