Samsung Galaxy F54: బిగ్‌ బ్యాటరీ, 108 MP కెమెరాతో శాంసంగ్‌ కొత్త ఫోన్‌

Samsung Galaxy F54 features: శాంసంగ్‌ నుంచి ఎఫ్‌ 54 5జీ స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. ఇందులో 108 కెమెరా, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. ధర రూ.27,999గా కంపెనీ నిర్ణయించింది. 

Published : 06 Jun 2023 19:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌ (Samsung) మరో 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. ఎఫ్‌ సిరీస్‌లో ఎఫ్‌54 5జీ (Samsung Galaxy F54 5G) ఫోన్‌ను తీసుకొచ్చింది. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 108 ఎంపీ కెమెరా, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం వంటివి ఇందులో ఉన్నాయి. ఇంకా ఏమేం ఫీచర్లు ఉన్నాయి? ధరెంత? వంటి వివరాలు చూద్దాం..

శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 54 5జీ 8జీబీ+256జీబీ సింగిల్‌ వేరియంట్‌లో వస్తోంది. దీని ధరను కంపెనీ రూ.27,999గా కంపెనీ పేర్కొంది. బ్లూ, సిల్వర్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్‌ వెబ్‌సైట్లో బుకింగ్స్‌కు అనుమతిస్తున్నారు. నేటి (జూన్‌ 6) నుంచే ఈ ఫోన్‌ ప్రీ ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. జూన్‌ 12 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి.

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌+ డిస్‌ప్లే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్‌ రేట్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ ఉంది. ఆండ్రాయిడ్‌ 13తో కూడిన వన్‌యూఐ 5.1తో వస్తోంది. ఇందులో ఎగ్జినోస్‌ 1380 ప్రాసెసర్‌ను అమర్చారు. వెనుక వైపు 108 ఎంపీ ప్రధాన కెమెరా అమర్చారు. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్ ఉంది. దీంతో పాటు 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్‌ అమర్చారు. సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. సౌడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంది. శాంసంగ్ బ్రాండ్‌లో 5జీ ఫోన్‌ కోసం చూస్తున్నవారు ఈ ఫోన్‌ పరిశీలించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని