Samsung: శాంసంగ్ కొత్త యాడ్.. యాపిల్‌పై మరోసారి సెటైర్!
దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ శాంసంగ్.. ఐఫోన్లను తయారు చేసే యాపిల్ కంపెనీపై మరోసారి సెటైర్ వేసింది. ఫోల్డబుల్ ఫోన్ల విషయంలో యాపిల్‌ను వెక్కిరించింది.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ శాంసంగ్.. ఐఫోన్లను తయారు చేసే యాపిల్ కంపెనీపై మరోసారి సెటైర్ వేసింది. ఐఫోన్లలో కొత్తగా నాచ్ ప్రవేశపెట్టినప్పుడు.. ఛార్జర్ తొలగించినప్పుడు శాంసంగ్ ఇలానే తన ప్రకటనల్లో యాపిల్‌పై విమర్శలు చేసింది. ఇప్పుడూ అదే తరహాలో ఫోల్డబుల్ ఫోన్ల విషయంలో యాపిల్‌ను మరోసారి వెక్కిరించింది. ఇప్పటికే కొన్ని ఫోల్డబుల్ ఫోన్లను శాంసంగ్ తీసుకురాగా.. యాపిల్ వద్ద ఒక్క ఫోల్డబుల్ కూడా లేకపోవడాన్ని ఉద్దేశించి ఈ సెటైర్ వేసింది. దీనికి సంబంధించి శాంసంగ్ యూఎస్ ఛానల్‌లో ‘ఆన్‌ది ఫెన్స్’ పేరిట ఓ వీడియోను రిలీజ్ చేసింది.
30 సెకన్లు నిడివి కలిగిన ఈ వీడియోలో.. ఓ వ్యక్తి గోడమీద కూర్చుని ఉండగా.. మరో ఇద్దరు వ్యక్తులు అతడిని వెళ్లొద్దని వారిస్తుంటారు. ‘శాంసంగ్ వద్ద ఫోల్డబుల్ ఫోన్లు, అద్భుతమైన కెమెరాలు ఉన్నాయం’టూ గోడపై కూర్చున్న వ్యక్తి చెప్పగా.. ‘త్వరలోనే ఇక్కడా వస్తాయి’ అని ఆ ఇద్దరూ అతడికి నచ్చజెపుతుంటారు. ‘ఇప్పటికే ఉండగా ఎందుకు’ అంటూ గోడపై వ్యక్తి చెప్పడంతో ముగుస్తుంది. వారించే ఆ ఇద్దరు వ్యక్తులను యాపిల్ యూజర్లుగా పరోక్షంగా పేర్కొంటూ ఈ యాడ్‌ను రూపొందించారు. యాడ్ సంగతి పక్కనపెడితే యాపిల్ ఓ ఫోల్డబుల్ ఫోన్ తీసుకొస్తోందన్న రూమర్స్ అయితే ఉన్నాయి. 2024లో ఈ ఫోన్ రాబోతోందని తెలుస్తోంది. మరి శాంసంగ్ ప్రకటనపై యాపిల్ ఏవిధంగా స్పందిస్తుందో లేదో చూడాలి!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nimmagadda: ప్రజాస్వామ్యం బలహీన పడేందుకు అంతర్గత శత్రువులే కారణం: నిమ్మగడ్డ
-
Asian Games: భారత్ ఖాతాలోకి రెండు స్వర్ణాలు
-
GVL Narasimha Rao: దసరా లోపు విశాఖ - వారణాసి రైలు: జీవీఎల్
-
Shruti Haasan: ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం.. శ్రుతి హాసన్ ఎమోషనల్ పోస్ట్
-
Delhi Robbery: ₹ 1400 పెట్టుబడితో ₹ 25 కోట్లు కొట్టేద్దామనుకున్నారు
-
Avanigadda: మెగా డీఎస్సీ ఎక్కడ జగనన్నా?: వారాహి యాత్రలో నిరుద్యోగుల ఆవేదన