Samsung: శాంసంగ్‌ కొత్త ఫ్లిప్‌, ఫోల్డ్‌ ఫోన్లు వచ్చేశాయ్‌.. ధర, ఇతర వివరాలు ఇవే..!

Samsung Unpacked event: శాంసంగ్‌ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్లో గెలాక్సీ ఫ్లిప్‌, ఫోల్డబుల్‌ ఫోన్లను లాంచ్‌ చేసింది. వీటితో పాటు మరికొన్ని ఉత్పత్తులను తీసుకొచ్చింది.

Published : 11 Jul 2024 00:21 IST

Samsung | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌ (Samsung) అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ను పారిస్‌లో నిర్వహించింది. ఇందులో గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ 6, గెలాక్సీ జడ్‌ ఫోల్డ్‌ 6 ఫోన్లను లాంచ్‌ చేసింది. గెలాక్సీ వాచ్‌ అల్ట్రా, గెలాక్సీ వాచ్‌ 7, గెలాక్సీ బడ్స్‌ 3 సిరీస్‌ను విడుదల చేసింది. వీటితో పాటు గెలాక్సీ రింగ్‌ను లాంచ్‌ చేసి తొలిసారి స్మార్ట్‌రింగ్‌ కేటగిరీలోకి ఎంట్రీ ఇచ్చింది.

గెలాక్సీ ఫ్లిప్‌ (Samsung Galaxy Z Flip 6): శాంసంగ్‌ కంపెనీ గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డైనమిక్‌ అమోలెడ్‌ 2ఎక్స్‌ డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz రీఫ్రెష్‌ రేటుతో పనిచేస్తుంది. ఫోల్డ్‌ డిస్‌ప్లే 3.4 అంగుళాల హెచ్‌డీ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌ అమర్చారు. ఆండ్రాయిడ్‌ 14తో పనిచేస్తుంది. 50 ఎంపీ ఓఐఎస్‌ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరాతో పాటు 10 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో వస్తోంది. ధరలు: 256GB ధర ₹1,09,999, 512GB ధర ₹1,21,999.

గెలాక్సీ ఫోల్డ్‌ (Samsung Galaxy Z Fold 6): గెలాక్సీ ఫోల్డ్‌లో 7.6 అంగుళాల QXGA+ డైనమిక్‌ AMOLED ఇన్నర్‌ డిస్‌ప్లే అమర్చారు. 6.3 అంగుళాల హెచ్‌డీ+ డైనమిక్‌ అమోలెడ్‌ ఔటర్‌ డిస్‌ప్లేతో వస్తోంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్‌ 14తో పనిచేస్తుంది. 50 ఎంపీ OIS కెమెరా, 12 ఎంపీ అల్ట్రావైడ్‌, 10 ఎంపీ 3X ఆప్టికల్‌ జూమ్‌ కెమెరాతో వస్తోంది. 4,400 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో వస్తోంది. ఎస్‌- పెన్‌ సపోర్ట్‌ ఉంది. ధరలు: 256GB ధర ₹1,64,999, 512 GB ధర ₹1,76,999, 1TB ధర ₹2,00,999

వాచ్‌లు, బడ్స్‌, రింగ్‌..

వీటితో పాటు శాంసంగ్‌ సంస్థ గెలాక్సీ వాచ్‌ 7, గెలాక్సీ వాచ్‌ అల్ట్రాను లాంచ్‌ చేసింది. గెలాక్సీ వాచ్‌ 7 ధరను భారత్‌లో రూ.29,999గా నిర్ణయించారు. వాచ్‌ అల్ర్టా ధరను రూ.59,999గా నిర్ణయించారు. గెలాక్సీ రింగ్‌ ధరను 399 డాలర్లుగా శాంసంగ్‌ పేర్కొంది. వేర్వేరు సైజుల్లో ఇది లభిస్తుంది. భారత్‌లో దీని ధర తెలియాల్సి ఉంది. గెలాక్సీ బడ్స్‌ 3 పేరుతో టీడబ్ల్యూఎస్‌ను కూడా శాంసంగ్‌ లాంచ్‌ చేసింది. బడ్స్‌ ధర ₹14,999 కాగా.. బడ్స్‌ ప్రో ధరను ₹19,999గా నిర్ణయించారు. ఈ ఉత్పత్తుల ప్రీ ఆర్డర్లు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. జులై 24 నుంచి విక్రయాలు మొదలవుతాయని కంపెనీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు