IRCTC: ఐఆర్‌సీటీసీ ఆఫర్‌.. విమాన టికెట్లపై ఆ ఛార్జీలు జీరో

IRCTC: ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ 24 ఏళ్లు పూర్తిచేసుకోనున్న సందర్భంగా విమాన టికెట్ల బుకింగ్‌పై ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది.

Updated : 26 Sep 2023 18:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. విమాన టిక్కెట్ల బుకింగ్‌పై ప్రయాణికుల నుంచి ఎలాంటి కన్వినియన్స్‌ రుసుము (convenience fees) వసూలు చేయబోమని ప్రకటించింది. 24 ఏళ్లు పూర్తిచేసుకోనున్న సందర్భంగా  ఈ ప్రత్యేక ఆఫర్‌ తీసుకొచ్చినట్లు ఐఆర్‌సీటీసీ అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో పంచుకుంది. అయితే ఈ ఆఫర్‌ కేవలం మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుందని తెలిపింది.

అత్యంత పోటీ ఉన్న ఏవియేషన్ మార్కెట్ లో భారత్‌ ఒకటి : ఇండిగో చీఫ్‌

ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 27న ఐఆర్‌సీటీసీ తన వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకొంటుంది. ఐఆర్‌సీటీసీ నెలకొల్పి ఈనెల 27 నాటికి 24 ఏళ్లు పూర్తికానుంది. ఈ సందర్భంగా సెప్టెంబరు 25 నుంచి 27 వరకు ప్రత్యేక ఆఫర్‌ తీసుకొచ్చింది. ఈ మూడు రోజుల్లో తన వెబ్‌సైట్‌ నుంచి బుక్‌ చేసుకొనే  దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై ఎటువంటి కన్వినియన్స్‌ రుసుము వసూలు చేయబోమని తెలిపింది. కొన్ని డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల ద్వారా విమాన టికెట్లు బుక్‌ చేసుకుంటే రూ.2వేల వరకు అదనంగా డిస్కౌంట్‌ కూడా పొందవచ్చని ఐఆర్‌సీటీసీ తెలిపింది. వీటితో పాటూ ఐఆర్‌సీటీసీ పోర్టల్ ద్వారా బుక్ చేసుకునే ప్రతి టిక్కెట్‌కు రూ. 50 లక్షల ప్రయాణ బీమాను కూడా అందిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని