Insurance: సాధారణ బీమా Vs టర్మ్ ఇన్సూరెన్స్.. ఏది బెటర్..?
Savings Insurance or Term Insurance: బీమా పాలసీ తీసుకునే విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. సాధారణ బీమా, టర్మ్ ఇన్సురెన్స్ పాలసీల విషయంలో వారిలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతుంటాయి.
ఒకప్పటిలా కాకుండా ఇప్పటితరం వారు బీమాకున్న (Insurance) ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. ఆదాయార్జన ప్రారంభమవ్వగానే చిన్న వయసులోనే జీవిత బీమా తీసుకుంటున్నారు. ఇక్కడే చాలా మందికి ఓ ప్రశ్న వేధిస్తుంటుంది. పొదుపు+బీమా కలిగిన సాధారణ బీమా (Savings Insurance) తీసుకోవాలా? కేవలం బీమా మాత్రమే (Term Insurance) అందించే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలా? అని. ఒకవేళ మీకూ ఆ సందేహం ఉంటే.. రెండింటికీ మధ్య తేడా ఏంటో తెలుసుకుని మీకు నప్పే పాలసీని తీసుకోండి.
ఇవాళ సంపాదించే దాంట్లో రేపటికి ఎంతో కొంత దాచుకోవాలన్నది పెద్దలు చెప్పే మాట. వివాహం చేసుకోవాలన్నా, కారు కొనాలన్నా ఎంతో కొంత దాచుకుంటేనే సాధ్యం. అలాగే మన తర్వాత కుటుంబానికి ఆర్థికంగా రక్షణ అందించడమూ ముఖ్యమే. సాధారణ బీమా, టర్మ్ బీమా పాలసీలకు వేర్వేరు ఆర్థిక లక్ష్యాలు ఉన్నాయి. మీ లక్ష్యమేమిటన్నది నిర్ణయించకుంటే ఇందులో ఏ బీమా పాలసీ ఎంచుకోవాలో నిర్ణయించుకోవడం సులువు అవుతుంది. ఇప్పుడు ఈ పాలసీల మధ్య ఉన్న తేడా చూద్దాం..
సాధారణ బీమా
ప్రయోజనాలు: రిస్క్‌లేని పొదుపు పథకంగా దీన్ని చెప్పొచ్చు. ఇందులో (పొదుపు+బీమా) రెండు ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం పొదుపుగానే కాకుండా పాలసీ అమల్లో ఉన్న కాలంలో జరగరానిది ఏదైనా జరిగితే మనల్ని నమ్ముకున్న వారికి ఆర్థికంగా రక్షణ ఇస్తుంది.
చెల్లింపులు: పొదుపు ఆధారిత సాధారణ బీమా పాలసీల్లో ఇంత మొత్తం చెల్లిస్తామనేది ముందుగానే బీమా సంస్థలు పేర్కొంటాయి. పాలసీ కాలవ్యవధి (మెచ్యూరిటీ తర్వాత) పూర్తయ్యాక ఆ మొత్తం చెల్లిస్తారు. ఒకవేళ పాలసీ గడువు ముగియక ముందే పాలసీ తీసుకున్న వ్యక్తి దూరమైతే నామినీకి దాదాపు వార్షిక ప్రీమియం మొత్తానికి దాదాపు 10 లేదా 11 రెట్లు చెల్లిస్తారు. కొన్ని పాలసీలు మెచ్యూరిటీ అనంతరం నిర్దిష్ట సంవత్సరాల పాటు రెగ్యులర్ ఆదాయం అందించే ప్రయోజనాలనూ అందిస్తున్నాయి.
మెచ్యూరిటీ: పొదుపు ఆధారిత బీమా పాలసీలు 5 నుంచి 20 ఏళ్ల కాలవ్యవధితో వస్తుంటాయి. స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలు కలిగిన వారు ఈ బీమా పాలసీలను ఎంచుకోవచ్చు. పిల్లల వివాహాలు, ఇంటి రిపేర్ వంటి లక్ష్యాలకు ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు.
టర్మ్ ఇన్సూరెన్స్
చెల్లింపులు: టర్మ్ ఇన్సూరెన్స్ ముఖ్య ఉద్దేశం పాలసీదారుడి మరణానంతరం వారి కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడం. సాధారణ బీమా పాలసీతో పోలిస్తే బీమా హామీ మొత్తం ఎక్కువగా ఉంటుంది. ఒక విధంగా పాలసీదారుడి మరణానాంతరం అతడి ఆదాయాన్ని ఈ తరహా పాలసీలు భర్తీ చేస్తాయి.
కాలవ్యవధి, మెచ్యూరిటీ: సాధారణంగా పాలసీ అమలులో ఉన్నంత కాలం ఈ పాలసీలు బీమా రక్షణ అందిస్తాయి. యుక్త వయసులో ఉన్నప్పుడే పాలసీని కొనుగోలు చేయడం మంచి ఎంపిక. అక్కడి నుంచి తక్కువ మొత్తం ప్రీమియం చెల్లిస్తూ మిగిలిన కాలానికి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. పాలసీ గడువు ముగిశాక ఎలాంటి మొత్తమూ తిరిగి రాదు. ఒకవేళ ఆ వ్యవధిలోపు ఏదైనా జరిగితే నామినీకి హామీ మొత్తాన్ని చెల్లిస్తారు. ప్రీమియం మొత్తాన్ని తిరిగి చెల్లించే పాలసీలూ అందుబాటులో ఉన్నాయి.
ప్రయోజనాలు: చెల్లించే ప్రీమియం తక్కువ అయినప్పటికీ నామినికీ చెల్లించే మొత్తం ఈ పాలసీల్లో ఎక్కువ ఉంటుంది. ఈ పాలసీలకు ప్రమాద బీమా, క్రిటికల్ ఇల్‌నెస్ వంటి రైడర్లనూ జత చేసుకోవచ్చు.
చివరగా: బీమా అనేది ప్రతి కుటుంబానికీ అవసరం. సాధారణ బీమా పాలసీలు పొదపుతో పాటు బీమా హామీని అందిస్తుండగా.. టర్మ్ పాలసీలు ఆర్జించే వ్యక్తి దూరమైనప్పుడు ఆర్థిక రక్షణ కల్పిస్తాయి. రెండు పాలసీలూ సెక్షన్ 10 (10)D, 80C కింద పన్ను ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఒక వ్యక్తి రెండు పాలసీలనూ తీసుకోవచ్చు.
-జాతవేద భట్టాచార్య, హెడ్-ప్రొడక్ట్ డిజైన్, ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Telugu Indian Idol 2: ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విజేత సౌజన్య
-
India News
Mamata Banerjee: ‘మృతుల సంఖ్యలో వాస్తవమెంత? ’
-
Crime News
Hyderabad: ఇద్దరు చిన్నారులు కిడ్నాప్.. గంటల వ్యవధిలో నిందితుల అరెస్టు
-
Crime News
Heart attack: శోభనం గదిలో గుండెపోటుతో నవదంపతుల మృతి
-
Sports News
WTC Final: అతడికి బౌలింగ్ చేసినా.. సచిన్‌కు చేసినా ఒకేలా భావిస్తా: వసీమ్ అక్రమ్
-
Politics News
CM KCR: ధరణి వద్దన్న వాళ్లనే బంగాళాఖాతంలో కలిపేద్దాం: సీఎం కేసీఆర్