SBI: అత్యాధునిక కాంటాక్ట్ సెంట‌ర్ ప్రారంభించిన ఎస్‌బీఐ!

దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI),  నెక్ట్స్ జ‌న‌రేష‌న్ కాంటాక్ట్ సెంట‌ర్ సేవ‌ల‌ను ప్రారంభించ‌న‌ట్లు తెలిపింది.

Published : 12 Oct 2022 13:50 IST

దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), అత్యాధునిక కాంటాక్ట్ సెంట‌ర్ సేవ‌ల‌ను ప్రారంభించ‌న‌ట్లు తెలిపింది. కస్టమర్లకు వ్యక్తీకతీక‌రించిన అనుభ‌వాన్ని (వక్తిగత సందేహాలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు ఆఫర్లు, ఉత్పత్తుల గురించి సమాచారం అందించడం మొదలైన సేవలు) అందించేందుకు ఈ సేవలను ప్రారంభించినట్లు ఎస్‌బీఐ తన ప్రకటనలో తెలిపింది. 

ఎస్‌బీఐ తెలిపిన వివరాల ప్రకారం..ఈ సర్వీస్‌ సెంటర్‌ కస్టమర్లకు 30కి పైగా బ్యాంకింగ్‌/ఫైనాన్షియల్‌ సేవలను అందిస్తుంది. ఈ సేవలు (వారంలో ఏడు రోజులూ) 24x7 అందుబాటులో ఉంటాయి. ఈ సేవలు ప్రస్తుతం తెలుగుతో సహా, 12 భారతీయ భాషల్లో (హిందీ, ఆంగ్లం, బెంగాలీ, తమిళం, కన్నడ, మరాఠీ, మలయాళం, ఒడియా, గుజరాతీ, అస్సామీ, పంజాబీ) అందుబాటులో ఉన్నాయి. 

కస్టమర్‌ సర్వీసు సేవలను సులభతరం చేసేందుకు, కస్టమర్లు సులభంగా గుర్తుంచుకునేలా నాలుగు అంకెల టోల్‌ ఫ్రీ నంబరు (1800-1234, 1800-2100)ను ప్రవేశ పెట్టింది. బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డులు, చెక్‌బుక్‌, ఏటీఎం కార్డు లేదా డిజిటిల్‌ ఛానళ్ళు బ్లాక్‌ చేయడం వంటి అత్యవసర సేవలు, డిజిటల్‌ ప్రొడక్ట్‌ల యాక్సెస్, సపోర్ట్‌, ప్రొడక్ట్‌ గురించిన సమాచారం వంటి పలు సేవల గురించి ఈ నంబర్లకు కాల్‌ చేసి కస్టమర్లు తెలుసుకోవచ్చు. 

ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం..కస్టమర్లు హెల్ప్‌లైన్‌ టోల్‌ ఫ్రీ నంబర్లు 1800 1234, 1800 11 2211, 1800 425 3800, 1800 2100 కు దేశంలోని అన్ని ల్యాండ్‌లైన్‌, మొబైల్‌ ఫోన్‌ల నుంచి 24X7 కాల్‌ చేయవచ్చు. కొన్ని నిర్థిష్ట నంబర్లకు కాల్‌ చేయడం ద్వారా నిర్ధిష్ట సేవలను పొందవచ్చు.

గుర్తుంచుకోండి..బ్యాంకు ప్రతినిధులు ఏటీఎం పిన్‌, ఏటీఎం కార్డు వివరాలు, పాస్‌వర్డ్‌, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారం అడగరు. ఫోన్‌ కాల్‌, ఈ-మెయిల్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఇలాంటి సమాచారం కోరితే..అటువంటి వాటికి సమాధానం ఇవ్వకండి. స్కామర్లు అధికారుల మాదిరిగా కాల్‌ చేసి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts